గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

దేవీ
శనివారం, 21 జూన్ 2025 (19:00 IST)
The 100 movie team
మొగలి రేకులు ఫేమ్ హీరో ఆర్‌కె సాగర్ అప్ కమింగ్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది 100’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రియా ఫిల్మ్ కార్ప్, దమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జె తారక్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ఈ రోజు మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. జూలై 11న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. అలాగే ఈ సినిమా నుంచి హే మేఘలే సాంగ్ ని లాంచ్ చేసిన మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేశారు.
 
ఈ చిత్రంలో ఆర్‌కే సాగర్‌కు జోడీగా మిషా నారంగ్ కథానాయికగా నటిస్తుండగా, ధన్య బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు టాప్  టెక్నికల్ పని చేస్తోంది శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీని, హర్షవర్ధన్ రమేశ్వర్ మ్యూజిక్‌ను, అమర్ రెడ్డి కుడుముల ఎడిటింగ్‌ను, చిన్నా ప్రొడక్షన్ డిజైన్‌ను, సుధీర్ వర్మ పెరిచర్ల డైలాగ్స్‌ను అందించారు.
 
హీరో ఆర్కే సాగర్ మాట్లాడుతూ, గడపగడపకు నేను ఆర్కే నాయుడు పేరుతో వెళ్లాను. ఇప్పుడు నా నుండి ఒక డిఫరెంట్ కంటెంట్ రావాలని, సామాజిక సందేశం ఉండాలని ఈ కథని ఎంచుకున్నాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా చేయడం జరిగింది. ఇప్పుడు విక్రాంత్ ఐపీఎస్ గా మళ్లీ  యూనిఫాం వేసుకున్నాను. అందరూ నచ్చిన తర్వాతే రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఆ టైం వచ్చింది. జూలై 11కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఈ సాంగ్‌ని కొరియోగ్రఫీ చేసిన ఈశ్వర్ కి థాంక్యూ. ఇది సినిమా థీమ్ సాంగ్. ఈశ్వర్ గారు చాలా చక్కగా కొరియోగ్రఫీ చేశారు. మేము అనుకున్న కంటెంట్‌కి ఇది నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. తను చేసిన "కోర్టు" సినిమా కూడా చూశాను. ఇప్పుడు ఆడియన్స్ అలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. "ది 100" కూడా అలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమానే. డెఫినిట్ గా ఈ సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఎవరినీ డిసప్పాయింట్ చేయదు'అన్నారు
 
డైరెక్టర్ శశిధర్ మాట్లాడుతూ, ‘మేఘాలే’ సాంగ్‌కి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకా అద్భుతంగా చేశారు. చాలా అద్భుతంగా ఈ పాట రూపొందించాం. సినిమాకి ఇంటర్నేషనల్ గా మంచి అప్లాజ్ వచ్చింది. మీడియా  మంచి, చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేసి గొప్ప స్థాయికి తీసుకెళ్లారు. అలాగే మా సినిమా కూడా మంచి కంటెంట్‌తో కూడిన సినిమా. మా సినిమాను కూడా ఎంకరేజ్ చేసి, విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఈ సినిమా తీశామని చాలా గర్వంగా ఉంది. మీరు చూస్తే మీకూ అలానే అనిపిస్తుంది. అలాంటి అనుభూతి వస్తుంది. మీడియా, ప్రేక్షకులు ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను'అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు మరణదండన

బాలయ్య జోలికి వస్తే చర్మం వలిచేస్తాం : వైకాపాకు టీడీపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్

ప్రహ్లాద్ కుమార్ వెల్లెళ్ల అలియాస్ ఐ బొమ్మ ఇమ్మడి రవి క్రిమినల్ స్టోరీ (video)

సౌదీ అరేబియాలో హైదరాబాద్ యాత్రికుల మృతి.. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. ఆదేశాలు జారీ

మక్కా నుండి మదీనాకు.. బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీ- 42మంది హైదరాబాద్ యాత్రికుల మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments