Webdunia - Bharat's app for daily news and videos

Install App

షోటైం లో నవీన్ చంద్ర ఏం చెప్పబోతున్నాడు - రిలీజ్ డేట్ లాంచ్ చేసిన అడవి శేషు

దేవీ
శనివారం, 21 జూన్ 2025 (18:42 IST)
showtime Poster
అనిల్ సుంకర ప్రౌడ్లీ ప్రెజెంట్.. స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిషోర్ గరికిపాటి నిర్మాతగా మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం షో టైం. నవీన్ చంద్ర హీరోగా మీనాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్న ఈ అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ చిత్రం జూలై 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ప్రజెంట్ చేస్తున్నారు. ఈ మేరకు హీరో అడవి శేషు చేతుల మీదుగా షో టైమ్ మూవీ విడుదల తేదీని ప్రకటించారు.
 
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకుడిని థియేటర్లో కట్టిపడేసి, అన్ని వర్గాల ప్రేక్షకులను రంజింపజేసే అద్భుతమైన కంటెంట్ షో టైం మూవీ లో ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. హీరో నవీన్ చంద్ర నటనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అలాగే బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ఈ చిత్రంలో ఒక అద్భుతమైన పాత్రతో ప్రేక్షకులను కట్టిపడయనున్నట్లు తెలుస్తోంది. విభిన్న పాత్రలతో అలరించే రాజా రవీంద్ర ఈ సినిమాలో మరో అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే విలక్షణ నటుడు నరేష్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నారు అని మేకర్ అభిప్రాయపడుతున్నారు.
 
ఇక యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో నవీన్ చంద్ర వరుసగా హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆయన నటించిన ఎలెవన్ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. పోలీస్ క్యారెక్టర్ లో ఆయన కనబరిచిన నటనకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే 28 డిగ్రీ సెల్సియస్ సినిమాకు సైతం మంచి ప్రశంసలు వచ్చాయి. వినూత్నమైన పాత్రలతో పాటు అద్భుతమైన సబ్జెక్టును అందించే హీరో నవీన్ చంద్ర నుంచి వస్తున్న ఈ షో టైం సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు.
 
జూలై 4న ఈ సినిమా విడుదల అవబోతున్న సందర్భంగా ఈపాటికే సామాజిక మాధ్యమాలల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. షో టైం మూవీ కచ్చితంగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది.
 
నటీనటులు: నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల, నరేష్, రాజా రవీంద్ర తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

Bengal: పట్టపగలే హత్య.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడిని కాల్చి చంపేశారు

తిరుమలలో ఆసక్తికర దృశ్యం.. అనుకోకుండా ఎదురుపడిన రోజా, నారాయణ (వీడియో)

వేడి వేడి మిర్చి బజ్జీ ప్రాణం తీసేసింది

Jagan: జగన్ రాఖీ శుభాకాంక్షలు.. ట్రోల్స్ మొదలు- దోచుకున్న దాన్ని దాచడానికి పోరాటం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments