Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా అంటేనే ఊహాజనితం.. నచ్చకపోతే చూడొద్దు : మద్రాసు హైకోర్టు

సాధారణంగా సినిమా అంటేనే ఊహాజనితమని నచ్చకపోతే చూడొద్దని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తమిళ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం "మెర్సల్". ఈ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2017 (12:07 IST)
సాధారణంగా సినిమా అంటేనే ఊహాజనితమని నచ్చకపోతే చూడొద్దని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తమిళ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం "మెర్సల్". ఈ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. 
 
అయితే, ఈ చిత్రంలో కొన్ని అభ్యంతరకర డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయి. వీటిపై తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది.
 
దీన్ని విచారించిన హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ సినిమాపై దాఖలైన పిటీషన్‌ను హైకోర్ట్ కొట్టివేసింది. సినిమా అంటేనే ఊహాజనితమని.. నచ్చకపోతే చూడొద్దని పేర్కొంది. ఈ తీర్పు 'మెర్సెల్‌'కు కాస్త ఊరటనిచ్చింది.
 
కాగా, అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన 'మెర్సల్' చిత్రంలో జీఎస్టీ, నోట్ల రద్దుతో పాటు వైద్యుల పట్ల వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్ ఉండటంతో బీజేపీకి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

తర్వాతి కథనం
Show comments