Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు షేడ్‌లో వరుజ్ తేజ్ మట్కా ఫస్ట్ లుక్

డీవీ
సోమవారం, 12 ఆగస్టు 2024 (11:21 IST)
Varuj Tej Matka First Look
వరుణ్ తేజ్ తన మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ 'మట్కా'తో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి మూవీని మ్యాసీవ్ స్కేల్ లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.
 
ఈరోజు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఇది వరుణ్ తేజ్‌ను యంగ్ స్టర్, అండ్ మిడిల్ ఏజ్ మ్యాన్ గా రెండు డిఫరెంట్ అవతార్స్ లో ప్రజెంట్ చేసింది. సినిమాలో నాలుగు డిఫరెంట్ గెటప్‌లలో హీరో 24 ఏళ్ల జర్నీని అద్భుతంగా చూపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అండర్‌డాగ్ నుంచి ఓవర్‌లార్డ్ వరకు రెండు షేడ్‌లు కనిపిస్తున్నాయి. అతను తన టెరిటరీకి రాజుగా ఎదుగుతాడు.
 
సిగార్ తాగుతూ ఇంటెన్స్ గా కనిపించిన హీరో డౌన్ ఇమేజ్‌లో యూత్, డాషింగ్‌గా కనిపించారు. అతని డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ వింటేజ్ వైబ్‌ లో అదిరిపోయాయి. రెండు లుక్స్ రిచ్ అండ్ స్టయిలీష్ గా వున్నాయి. తన టేబుల్ మీద తుపాకీ ఉంది. ప్లే కార్డులలో కింగ్ కార్డ్ బ్యాక్ డ్రాప్ గా వుంది. వరుణ్ తేజ్ డిఫరెంట్ షెడ్స్ లో కనిపించిన ఈ ఫస్ట్ లుక్ డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.  
 
పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  
 
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎ కిషోర్ కుమార్ డీవోపీ పని చేస్తుండగా, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.  
 
తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
 
తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: ఏపీ, తెలంగాణ అంతటా మూడు రోజుల సంతాప దినాలు- పవన్

ఉగ్రవాదులతో పోరాడిన ముస్లిం సోదరుడు.. పారిపోలేదు.. చివరికి బుల్లెట్లకు లొంగిపోయాడు..

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments