Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపికా నివాసముండే అపార్ట్‌మెంట్లో అగ్ని ప్రమాదం.. 95మంది సేఫ్

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో బాలీవుడ్ ప్రేమపక్షులు రణ్ వీర్ సింగ్, దీపిక పదుకొనే జోడి వివాహం చేసుకోనుందని బీటౌన్ గ

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (17:08 IST)
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో బాలీవుడ్ ప్రేమపక్షులు రణ్ వీర్ సింగ్, దీపిక పదుకొనే జోడి వివాహం చేసుకోనుందని బీటౌన్ గుసగుసలాడుకుంటోంది. ఈ ఏడాది చివరికల్లా మూడుముళ్ల బంధంతో ఇద్దరూ ఒక్కటవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
అత్యంత సన్నిహితుల సమక్షంలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌‌కే ఈ జోడీ మొగ్గుచూపుతోందని.. వివాహానంతరం ముంబై, బెంగళూరులలో రెండు భారీ రిసెప్షన్‌‌లను కూడా ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపికా పదుకునే నివాసం వుంటున్న ముంబయిలోని వర్లి ప్రాంతంలోని 45 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
 
33వ అంతస్తులో మంటలు చెలరేగడంతో దానిపై భాగంలో ఉన్న ఫ్లాట్‌లు కూడా దెబ్బతిన్నాయి. ఈ టవర్‌లోనే దీపికా పదుకునే ఫ్లాట్ కూడా వుంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో వచ్చి మంటలు ఆర్పుతున్నారు. 95 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 
 
ఈ ఘటనపై దీపికా స్పందిస్తూ.. తాను సురక్షితంగా వున్నానని.. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారని ట్విట్టర్లో వెల్లడించింది. ఇంకా ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదని.. రెండు అంతస్తుల వరకు పూర్తిగా అగ్నికి ఆహుతి అయినట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

గూఢచర్యానికి పాల్పడిన రాజస్థాన్ మాజీ మంత్రి పీఏ - అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments