Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌వితేజ స‌మ‌ర్ప‌ణ‌లో ఎఫ్ఐఆర్ ఫస్ట్ సింగిల్

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (19:14 IST)
Vishnu Vishal, Manjima Mohan
కోలీవుడ్ యాక్ట‌ర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న‌ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్` చిత్రానికి  మను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన‌ ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. ర‌వితేజ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండ‌డంతో సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ మ‌రింత పెరిగాయి.
 
ఈ చిత్రానికి అశ్వంత్ సంగీతాన్ని అందిచారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ ప్రయాణం అనే పాట విడుదలైంది. అద్భుతమైన బాణీకి అందమైన విజువల్స్ తోడైనట్టు కనిపిస్తోంది. రాకేందు మౌళి సాహిత్యం, అభయ్ జోధ్‌పుర్కర్ గానం అద్భుతంగా ఉంది. విష్ణు విశాల్, రేబా మోనికా జాన్‌ల కెమిస్ట్రీ హైలెట్ గా నిలిచింది.
 
సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఇర్ఫాన్ అహ్మద్ అనే అమాయక యువకుడి జీవితంలో, భయంకరమైన ఐస్ఐస్‌ ఉగ్రవాది అబూ బక్కర్ అబ్దుల్లా పరిశోధన ఆధారంగా ఎలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి అనేది ఎఫ్ఐఆర్ మూల‌కథ. ఈ కథ చెన్నై, కొచ్చి, కోయంబత్తూరు మరియు హైదరాబాద్ వంటి న‌గ‌రాల్లో జ‌రుగుతుంది.
 
స్టార్ డైరెక్ట‌ర్‌ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు, మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్, మాల పార్వతి త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.
 
ఈ సినిమాకు అరుల్ విన్సెంట్ కెమెరామెన్‌గా, అశ్వంత్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.
 
నటీనటులు : విష్ణు విశాల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మంజిమా మోహన్, రైజా విల్సన్, రేబా మోనికా జాన్, మాల పార్వతి తదితరులు
 
సాంకేతిక వ‌ర్గం: నిర్మాత - విష్ణు విశాల్, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం - మ‌ను ఆనంద్‌, స‌మ‌ర్ప‌ణ‌- ర‌వితేజ‌, 
డిఓపి- అరుల్ విన్సెంట్‌,  మ్యూజిక్‌- అశ్వంత్‌, ఎడిట‌ర్- ప్ర‌స‌న్న జీకే,  పాట‌లు - రాకేందు మౌళి, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ - అనిత మ‌హేంద్ర‌న్‌,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్ - సీతారాం స్ర‌వంతి సాయినాథ్ దినేష్ క‌ర్ణం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

ఖమ్మం: ‘హాస్టల్‌లో నన్ను లెక్కలేనన్ని సార్లు ఎలుకలు కరిచాయి, 15 సార్లు ఇంజెక్షన్ ఇచ్చారు’

Pawan: మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్- డోలీలకు స్వస్తి.. గుడి కాదు.. బడి కావాలి.. (videos)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments