Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ నటి జయంతి నిక్షేపంలా జీవించేవున్నారు...

సీనియర్ నటి జయంతి గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 73 యేళ్ళ ఈమె... కన్నుమూశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

Webdunia
బుధవారం, 28 మార్చి 2018 (10:41 IST)
సీనియర్ నటి జయంతి గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 73 యేళ్ళ ఈమె... కన్నుమూశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అలాంటిదేంలేదని మొత్తుకుంటున్నా ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె జీవించి నిక్షేపంలా ఉన్నారంటూ ఆమె కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. 
 
నిజానికి ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులతో మంగళవారం బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న జయంతి, మంగళవారం రాత్రి పరిస్థితి విషమించి కన్నుమూసినట్టు వార్తలు షికార్లు చేశాయి. ఈ వార్తలపై స్పందించిన జయంతి కుటుంబ సభ్యులు ఆమె నిక్షేపంలా ఉన్నారని, కోలుకుంటున్నారని తెలిపారు. 
 
జయంతి తన కెరియర్‌లో తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, మరాఠీ తదితర భాషల్లో మొత్తం 500 సినిమాల్లో నటించగా, అందులో 300 సినిమాలు లీడ్ రోల్ కావడం విశేషం. కర్ణాటక ప్రభుత్వం నుంచి రెండుసార్లు ఉత్తమ నటి అవార్డులు, అలాగే రాష్ట్రపతి అవార్డు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments