Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ మూడు పెళ్లిళ్లు చేస్కుంటే ఏంటి 30 చేస్కుంటే ఏంటి? నటి అపూర్వ

అపూర్వ.. కమెడియన్‌గా, విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఆరు అడుగుల హైట్‌తో వెరైటీ గెటప్‌లలో కనిపించే అపూర్వను ఆదరించే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అపూర్వ, పవన్ కళ్యాణ్‌‌కు అండగా నిలిచింది. పవన్ రాజకీయాల్లోకి వెళ్ళిన తరువాత ఇప్పుడు చ

Webdunia
మంగళవారం, 27 మార్చి 2018 (18:06 IST)
అపూర్వ.. కమెడియన్‌గా, విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఆరు అడుగుల హైట్‌తో వెరైటీ గెటప్‌లలో కనిపించే అపూర్వను ఆదరించే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అపూర్వ, పవన్ కళ్యాణ్‌‌కు అండగా నిలిచింది. పవన్ రాజకీయాల్లోకి వెళ్ళిన తరువాత ఇప్పుడు చురుగ్గా రాజకీయాలపైనే దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితంపై కొంతమంది విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో అపూర్వకు కోపమొచ్చింది. 
 
పవన్ కళ్యాణ్‌ నాకు సహోదరుడు. ఎన్నోసార్లు నేను ఆయన ఇంటికి వెళ్ళాను. స్వయంగా ఆయనే నాకు భోజనం చేసి పెట్టాడు. తోడబుట్టిన చెల్లెలులా చూసుకున్నాడు. ఎన్నోసార్లు మేము అలాగే కలిశాం. కానీ కొంతమంది అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని కూడా తప్పుబడుతూ రకరకాలుగా మాట్లాడారు. నేను అలాంటి వారిని అస్సలు పట్టించుకోను. ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏమిటి... ముఫ్ఫై చేసుకుంటే ఏమిటి. పవన్ పెళ్ళిళ్ళు చేసుకున్నాడు.
 
మిగిలిన వారు అది కూడా చేసుకోకుండా గుడి ఎనక నా స్వామిలా ఉన్నారు కూడా. అలాంటి వారిని ఏమనాలి. అందుకే నేను ఒకటే చెబుతున్నా. ఎవరి గురించి అయినా విమర్శ చేసేముందు బాగా తెలుసుకుని మాట్లాడాలి తప్ప నోటికి ఏదొస్తే అది మాట్లాడితే బాగుండదు. ఇంకోసారి ఎవరైనా పవన్ అన్నయ్య గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖచ్చితంగా వారి పేర్లతో పాటు వారి వ్యక్తిగత జీవితాలపైనా నేను కూడా విమర్శలు చేస్తానంటోంది అపూర్వ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments