Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప-2 ది రూల్‌ నుంచి ఫహాద్‌ ఫాజిల్‌ బన్వర్‌ సింగ్‌ షెకావత్‌ లుక్‌

డీవీ
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (08:26 IST)
Fahad Fazil
అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప-2'. ది రూల్‌ సినిమా విడుదల ఉందా? లేదా? అనే డౌట్ లో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న తరుణంలో సినిమా అప్ డేట్స్ ఇస్తోంది చిత్ర యూనిట్. తాజాగా ఫహాద్‌ ఫాజిల్‌ బన్వర్‌ సింగ్‌ షెకావత్‌ లుక్‌ విడుదలచేసి సినిమా రిలీస్ ఉందని తెలియజేస్తున్నారు. 
 
సుకుమార్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్‌ ఇండియా చిత్రంగా  ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌  అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. డిసెంబరు 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్న ఫహాద్‌ ఫాజిల్‌ క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఫహాద్‌ ఫాజిల్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. 
 
బన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా పుష్ప ది రైజ్‌లో ఆకట్టుకున్న ఫహాద్‌ ఈ చిత్రంలో అంతకు మించి క్రేజీగా ఆడియన్స్‌ను ఆకట్టుకోబోతున్నాడు. గల్ల లుంగీ ధరించి.. ఒక చేతిలో గన్‌తో...మరో చేతిలో గొడ్డలితో  ఫహాద్‌ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించిన విడుదలైన ప్రతి ప్రమోషన్‌ కంటెంట్‌ అందరిలోనూ అంచనాలు పెంచేస్తున్నాయి. టీజర్‌తో పాటు విడుదలైన రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది.రోజురోజు కు అంచనాలు పెంచుకుంటున్న ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. 
 
కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ ఆర్‌ఎఫ్‌సీలో భారీ వ్యయంతో వేసిన సెట్‌లో చాలా లావిష్‌గా జరుగుతుంది. ప్రస్తుతం పతాక సన్నివేశాలు అత్యంత అద్బుతంగా చిత్రీకరించే పనిలో వున్నారు. హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు పాల్గొంటున్నారు. సినిమాకు ఈ సన్నివేశాలు ఎంతో హైలైట్‌గా వుండబోతున్నాయని అంటున్నారు. అంతేకాదు రేపు థియేటర్‌లో ఈ పతాక సన్నివేశాలు గూజ్‌ బంప్స్‌ వచ్చే విధంగా వుంటాయని అంటున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments