Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెగా కుటుంబంతో విభేదాల్లో అల్లు అర్జున్ తగ్గేదేలేదే అనేది నిజమేనట!

Advertiesment
Allu arjun

డీవీ

, శనివారం, 20 జులై 2024 (07:44 IST)
Allu arjun
ఇటీవల మెగా కుటుంబంలో అల్లు అర్జున్ ప్రవర్తిన తీరు ఏకాకిని చేసిందనే వార్తలు ఫిలింనగర్ లో హల్ చేశాయి. ఆంద్ర ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయకుండా బయట తన భార్య చెల్లెలి భర్తకు వై.సి.పి. అభ్యర్థికి సపోర్ట్ చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొడం తెలిసిందే. దీనిపై మెగా ఫ్యాన్స్, బంధువులు కూడా షాక్ అయ్యారు. కానీ ఇలాంటి షాక్ లు ఇవ్వడం అల్లు అర్జున్ కు మామూలే. తన ఇండివిడ్యువల్ గా ఎదగాలనే కోరికను సన్నిహితుల దగ్గర వ్యక్తం చేసినట్లు కూడా తెలిసింది. అయితే ఈ వివాదం గురించి అల్లు అరవింద్ ను అడిగే సమయం వచ్చింది.
 
నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఎన్.టి.ఆర్. బామర్ది నితిన్ సినిమా ఆయ్ ప్రమోషన్ కు వచ్చారు. ఈ సందర్భంగా ప్రశ్న వేస్తే.. నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఆయన వివిరణ ఇస్తూ, ఏ కుటుంబంలోనైనా ఒకరి నిర్ణయం కొన్ని సమస్యలకు కారణమవుతుంది. ఇలాంటివి మామూలే. వచ్చి పోతుంటాయి. నంద్యాల వైసిపి అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ కు ప్రచారం వివాదం అయింది. నేను ఇరవై ఏళ్ళుగా మెగా ఫ్యామిలీని చూస్తున్నా. మెగా కుటుంబసభ్యులందరం కలిసి వుండాలని చిరంజీవిగారు కోరుకుంటుంటారు. ప్రతి సంక్రాంతికి ఆయన కుటుంబ సభ్యులందరినీ తీసుకుని బెంగుళూరు వెళుతుంటారు. మన అందరి కలిసి వుండాలనేది ఆయన భావన అని స్పందించారు.
 
అయితే దీనిపై అల్లు అరవింద్ ఏమీ మాట్లాడకుండా.. బన్నీ వాసు చేత మాట్లాడించారు. కలిసి వుండాలనేది చిరంజీవి భావన అన్నారేమినహా.. అల్లు అర్జున్ కు ఆ భావన లేదని స్పష్టంగా తెలిసిపోతుందని గుసగుసలు వినిపించాయి. దీంతో సినిమా ప్రమోషన్ కు అడ్డంకి అని వెంటనే స్టేజీ దిగి వెళ్ళిపోయారు. 
 
ఇక పుప్ప.. సీక్వెల్ విడుదలకు ముందు అల్లు అర్జున్ ప్రమోషన్ కు వెళితే ఇదే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి ఏవిధంగా డీల్ చేస్తారో చూడాలి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కథ బాగుంది చేసేయండి అని ఎన్టీఆర్ అన్నారు : అల్లు అరవింద్