Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీ నమ్మకాన్ని నిలబెట్టిన ఎఫ్2.. అంతేగా...

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (16:45 IST)
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్2'. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌లు కలిసి నటించిన ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై బంపర్ హిట్‌ అయింది. ఈ చిత్రం తొలి ఆట నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 
 
ముఖ్యంగా, కథల విషయంలో వెంకటేశ్‌ను ఒప్పించడం అంత తేలికైన పనేంకాదు.. ఆయనకి ఉన్న అనుభవం అలాంటిది. కథ.. అందులో తన పాత్ర విషయంలో పూర్తి క్లారిటీ రానిదే ఆయన సెట్స్‌పైకి రారు. అలాంటి వెంకటేశ్ సరైన కథ కోసం వెయిట్ చేస్తూ కొంత గ్యాప్ తీసుకున్నారు. ఈ సమయంలోనే అనిల్ రావిపూడి 'ఎఫ్2' కథతో ఆయనను ఒప్పించారు. ఆది కాస్త వెంకటేష్ నమ్మకాన్ని నిలబెట్టింది. 
 
విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకు వసూళ్లపరంగా ఈ సినిమా తన జోరును కొనసాగిస్తూనే వుంది. ఈ సినిమా విడుదలైన ఈ 20 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.60 కోట్లకిపైగా షేర్‌ను, ప్రపంచవ్యాప్తంగా రూ.74 కోట్లకి పైగా షేర్‌ను రాబట్టింది. ఇక, ఓవర్సీస్‌లో ఈ సినిమా ఇంతవరకూ రూ.8 కోట్లకి పైగా వసూళ్లను సాధించడం విశేషం. వెంకీ కెరియర్‌లో అత్యధిక వసూళ్లను.. లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా 'ఎఫ్ 2'ను గురించి చెప్పుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments