Webdunia - Bharat's app for daily news and videos

Install App

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

దేవీ
సోమవారం, 19 మే 2025 (07:25 IST)
Filmchamber building
థియేటర్లకు ప్రేక్షకులు రావడంలేదని గందరగోళంలో వున్న థియేటర్ యాజమాన్యాలు గత కొంతకాలంగా షాపింగ్ మాల్స్ లా మార్చేదిశలో అడుగులువేస్తున్నారు. సింగిల్ థియేటర్లు దీనివల్ల చాలా లాస్ అవుతున్నాయి. స్టాఫ్ కు జీతాలు ఇచ్చే స్థితిలో యాజమాన్యం లేదు. పైగా ఇటీవలే కార్మికసంఘాల నాయకులతో హైదరాబాద్ లోని థియేటర్ల యూనియన్ కలిసి ఎగ్జిబిటర్లతో మాట్లాడారు. బోనస్ లు విషయం ప్రస్తావన కూడా వచ్చిందని నాయకులు తెలిపారు. ఇది ఇలా జరుగుతుండగా నిన్న ఆదివారంనాడు జూబ్లీహిల్స్ లోని ఫిలింఛాంబర్ లో ఎగ్జిబిర్లంతాకలిసి సమావేశం అయ్యారు. 
 
మీటింగ్ సారాంశం ప్రకారం, అద్దె ప్రాతిపదికన సినిమాల్ని ప్రదర్శించడంవల్ల తమకు ఆదాయం సరిపోవడంలేదనీ, మల్టీప్లెక్స్ తరహాలో వసూళ్ళలో పర్సెంటేజీ విధానాన్ని అమలు చేయాలని సింగిల్ థియేటర్ల యాజమాన్యం పట్టుపట్టింది. దీనిపై నిర్మాతలు, పంపిణీదారులు ఓ నిర్ణయం తీసుకోవాలని లేకపోతే జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ చేస్తామని పిలుపుఇచ్చారు.
 
మా నిర్ణయాలను నిర్మాతలమండలికి ప్రధానంగా చెప్పి, అందరికీ లెటర్లు రాయాలని వారు కోరారు. అయితే పర్సంటేజ్ విధానంతో తాు నష్టపోవాల్సి వస్తుందనీ పలువురు పంపిణీదారులు, నిర్మాతలు గతంలోనే నిర్మాతలమండలికి విన్నవించారు. అయితే గత కొంతకాలంగా సరైన సినిమాలు లేకపోవడంతో ఆ సమస్య కాగితాలపైనే వుంది. ఇక ప్రస్తుతం వచ్చనెలలో పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు అగ్రహీరోల సినిమాలు విడుదలకావడంతో ఎగ్జిబిటర్లు పట్టుబట్టారు. బంద్ జరిగితే ఇప్పటికే సినిమాల విడుదలకు వున్నవి  ఆగిపోతాయి. దాంతో నిర్మాతలు బయట తెచ్చిన డబ్బులకు వడ్డీ కట్టాల్సివస్తుంది. దీంతో పరిశ్రమ వర్గాలు ఆందోళనలో వున్నాయి.
 
అయితే పర్సెంటేజ్ విధానం అనేది సినిమా స్థాయిని బట్టి కూడా వుంటుంది. చిన్న సినిమాలకు, పెద్దలసినిమాలకు తేడా చూపించాలి. ఇప్పటికే పెద్ద సినిమాలకు టికెట్ల రేట్లు పెంచేసుకుని అందరూ లాభపడుతున్నారు. ప్రభుత్వం కూడా టాక్స్ తీసుకుంటుందనీ, కానీ చిన్న సినిమాకు ఎంత పర్సెంటేజ్ వుంటుంది. పెద్ద సినిమాలకు ఎంత అనేది ఇంకా క్లారిటీ రాలేదని, దీనిపై నిర్మాతలంతా కలసి మాట్లాడేలా చర్యలు ఛాంబర్ తీసుకోవాలని చిన్న నిర్మాతల మాజీ అధ్యక్షుడు నట్టికుమార్ పేర్కొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments