Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Advertiesment
poonam kaur
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సినీ నటి పూనమ్ కౌర్ బహుమతి ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ ప్రైవేట్ డిజిటల్ మీడియా సంస్థ వజ్రోత్సవ వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి పూనమ్ కౌర్‌ సీఎం చంద్రబాబు ఓ విశిష్ట కానుక అందించారు. 
 
ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అమరావతి స్ఫూర్తిని ప్రతిబింభించేలా ఓ చిత్రపట ఆర్ట్ వర్క్‌ను ఆయనకు బహుకరించినట్టు పూనమ్ కౌర్ వెల్లడించారు. ఈ మేరకు ఫోటోను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఆమె పోస్టుకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్