బిగ్ బాస్ హౌస్‌లోకి తాప్సీ.. ఎందుకెళ్లినట్టు..?

బాలీవుడ్‌ రియాల్టీ షో కల్చర్ దక్షిణాదికి కూడా పాకింది. తాజాగా కోలీవుడ్, టాలీవుడ్‌లలో బిగ్ బాస్ షో ప్రారంభమైంది. తమిళ బిగ్ బాస్ షోకు సినీ లెజెండ్ కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక టాలీవుడ్‌లో

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (16:22 IST)
బాలీవుడ్‌ రియాల్టీ షో కల్చర్ దక్షిణాదికి కూడా పాకింది. తాజాగా కోలీవుడ్, టాలీవుడ్‌లలో బిగ్ బాస్ షో ప్రారంభమైంది. తమిళ బిగ్ బాస్ షోకు సినీ లెజెండ్ కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌‌గా బిగ్ బాస్ షో జరుగుతోంది. ఈ రెండూ షోలతో సదరు టీవీ రేటింగ్లు అమాతం పెరిగిపోతున్నాయి. 
 
కమల్ హాసన్ తన బిగ్ బాస్ షోలో రాజకీయాలు, సామాజంలో జరిగే లోటుపాట్లను ప్రస్తావిస్తుండటంతో ఆ షోకు తమిళ తంబీలు బాగా ఆదరిస్తున్నారు. ఇక ఇటు యంగ్ టైగర్ రాజకీయాలపై మాట్లాడకపోయినా.. ఎంటర్‌టైన్ ప్రోగామ్‌గా తెలుగు బిగ్ బాస్ రేటింగ్ పరంగా దూసుకెళ్తోంది. 
 
స్టార్ మాలో ప్రసారమవుతోన్న ఈ షో ద్వారా తమ సినిమాలు ప్రచారం చేసుకునేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే బిగ్ బాస్ హౌస్‌లోకి నేనే రాజు నేనే మంత్రి హీరో, బాహుబలి భల్లాలదేవ ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. 
 
తాజాగా ఆనందో బ్రహ్మ సినిమా యూనిట్ బిగ్ బాస్ ద్వారా సినిమా ప్రమోషన్‌కు రంగం సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో 'బిగ్ బాస్' హౌస్ లోకి తాప్సీ అడుగుపెట్టినట్టుగా తెలుస్తోంది. సినిమా నేపథ్యానికి సంబంధించిన కాన్సెప్ట్‌తో ఆమె 'బిగ్ బాస్' హౌస్‌లో సందడి చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments