Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరూ బావుండాలి థియేటర్‌లో మనందరం ఉండాలిః ప్రభాస్‌

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (17:09 IST)
Ali-Prabhas-Naresh
నరేశ్, అలీ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’. మలయాళంలో విడుదలై సంచలన విజయంగా నమోదైన ‘వికృతి’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. సోషల్‌ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.   
 
అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు. 1100 సినిమాల్లో అనేక పాత్రల్లో నటించిన అలీ హీరోగా తన బ్యానర్‌లో నిర్మిస్తోన్న తొలిచిత్రం కావటంతో ఎంతో గ్రాండియర్‌గా సినిమాను తెరకెక్కించే ఉద్ధేశ్యంతో ఎక్కడ రాజీపడకుండా దాదాపు 20 మంది అగ్ర నటీనటులతో సినిమాను తీశారు. సినిమా షూటింగ్‌ పూర్తయిన సంరర్భంగా అలీకి అభినందనలు తెలియచేశారు యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌. 
 
ప్ర‌భాస్ మాట్లాడుతూ, అలీ గారు అనేక సినిమాలు చేసి సినిమా పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే బ్యానర్‌ని పెట్టి సినిమాలు తీయటం చాలా ఆనందంగా ఉంది. ఆయన బ్యానర్‌ సౌండ్‌ బావుంది. ఈ సినిమా విషయానికి వస్తే ‘వికృతి’ అనే మలయాళ సినిమాను తెలుగులో `అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’ అనే పేరుతో రీమేక్‌ చేశారు.మలయాళంలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా మంచి మెసేజ్‌తో తెలుగులో విడుదలవ్వటం చాలా హ్యాప్పీగా ఉంది. ఈ సినిమా సంగీత దర్శకుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేసిన రాకేశ్‌ను ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నారట. అందరూ బావుండాలి థియేటర్‌లో మనందరం ఉండాలి’ అన్నారు.
 
అలీ మాట్లాడుతూ, ప్రభాస్‌తో నేను ‘యోగి’, ‘బుజ్జిగాడు’, ‘ఏక్‌ నిరంజన్‌’,‘ బిల్లా’, ‘రెబల్‌ ‘ ఇలా అనేక చిత్రాల్లో నటించిన పరిచయంతో మా సినిమా మొదటి సాంగ్‌ రిలీజ్‌ చేయాలి అని అడిగాను. ప్రభాస్‌  ఇండియాలో లేనప్పటికి నా మీద అభిమానంతో మా సినిమా గురించి మాట్లాడుతూవీడియో చేసి పంపించారు. మా ‘అందరూ బావుండాలి.’ సినిమా ప్రమోషన్‌ను ప్రభాస్‌తో ప్రారంభించటం ఆనందంగా ఉంది.మా సినిమా మొదటి పాట లహరి మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లో విడుదలవుతుంది. కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. పరిస్థితులు చక్కదిద్దుకోగానే విడుదల తేదిని ప్రకటిస్తాం’’ అన్నారు. 
 
శివబాలాజీ,  మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి,సనా, వివేక్, శివారెడ్డి, సప్తగిరి, పృధ్వీ, రామ్‌జగన్, భద్రం, లాస్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి చీఫ్‌ క్రియేటివ్‌ హెడ్‌– ఇర్ఫాన్, కో డైరెక్టర్‌– ప్రణవానంద్‌  కెమెరా– ఎస్‌ మురళీమోహన్‌ రెడ్డి, ఆర్ట్‌– కెవి రమణ, డాన్స్‌ డైరెక్టర్‌– స్వర్ణ, ఎడిటర్‌– సెల్వకుమార్, ఫైట్స్‌–నందు, మేకప్‌–నంద్యాల గంగాధర్, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌– సయ్యద్‌ తాజ్‌ బాషా, విఎఫ్‌ఎక్స్‌– మాయాబజార్‌ స్టూడియో

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments