Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి సినిమా ఒక పరీక్ష లాంటిదే : జిలేబి డైరెక్టర్ కె. విజ‌య‌భాస్కర్

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2023 (19:08 IST)
K. Vijayabhaskar, Guntur Ramakrishna, Anju Asrani, Srikamal
నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలని అందించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె. విజ‌య‌భాస్కర్ చాలా విరామం చేసిన యూత్ ఫుల్ ఫన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ 'జిలేబి'. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే ఆర్ట్స్ బ్యానర్ పై ఈ  చిత్రాన్ని నిర్మించారు. అంజు అశ్రాని చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. విజ‌య‌భాస్కర్ త‌న‌యుడు శ్రీకమల్ హీరోగా పరిచమైన ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటించారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆగస్ట్ 18న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది. 
 
ఈ నేపద్యంలో దర్శకుడు కె. విజ‌య‌భాస్కర్ మాట్లాడుతూ.. ఇంత మంచి ఫన్ ఎంటర్ టైనర్ ని ఎంచుకొని, ఎక్కడా రాజీపడకుండా ఒక పెద్ద సినిమాలా నిర్మించిన నిర్మాతలు రామకృష్ణ, అంజుఅశ్రాని కి ధన్యవాదాలు. సినిమాపై వున్న నమ్మకంతో సొంతగా రిలీజ్ చేశారు. సినిమా చూసినప్పుడు ఫస్ట్ టైం ప్రొడక్షన్ లా ఎక్కడా అనిపించదు. 'జిలేబి' సినిమా చదువుకునే రోజులు, హాస్టల్ డేస్ ని మళ్ళీ గుర్తుకు తెచ్చింది. ప్రతి సినిమా ఒక పరీక్ష లాంటిదే. ఐతే చదువుకునే రోజుల్లో పరీక్ష ఒత్తిడితో రాసేవాళ్ళం. ఇక్కడ మాత్రం ఎంజాయ్ చేస్తూ రాస్తాం. సినిమాలో వినోదం ఎలా వుందో ప్రేక్షకులు చూసి చెప్పాలి. శ్రీకమల్, శివానితో పాటు నటీనటులంతా చక్కగా నటించారు. రాజేంద్రప్రసాద్ గారు, మురళీశర్మ వారి అనుభవాన్ని జోడించారు. మణిశర్మ చక్కని సంగీతం అందించారు. రామజోగయ్యశాస్త్రీ గారి లిరిక్స్ హైలెట్. అలాగే భాను అద్భుతంగా కోరియోగ్రఫీ చేశారు. అందరూ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. కమల్ ఇప్పుడే ప్రయాణం మొదలుపెట్టాడు. ఇంకా మీ ప్రేమ కావాలి. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయని ప్రామిస్ చేయగలం. సినిమా చూసిన తర్వాత మీ ఫీడ్ బ్యాక్ ని ఇవ్వండి'' అని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ద్వారంపూడిని టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్... అలవాట్లు మార్చుకోండి..

పోలవరం.. విభజన కంటే జగన్‌తో రాష్ట్రానికి ఎక్కువ నష్టం: చంద్రబాబు

ఒకే వేదికను పంచుకోనున్న టి.సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి

తిరిగేది పరదాల చాటున, అయినా 986 మంది సెక్యూరిటీయా? మాజీ సీఎం జగన్ పైన సీఎం చంద్రబాబు (video)

కొత్త ఈవీ బ్యాటరీని తయారు చేసిన తెలుగు వ్యక్తి, 5 నిమిషాల చార్జింగ్‌తో 193 కిలోమీటర్ల ప్రయాణం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

తర్వాతి కథనం
Show comments