టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న నటి పావలా శ్యామల వయోభారం తెచ్చిన సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. గతంలో తను ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నట్లు మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం మరోసారి తన దీన స్థితిని తెలియజేస్తూ వీడియో ద్వారా అభ్యర్థించారు.
తన ఆర్థిక పరిస్థితి ఎంతమాత్రం బాగా లేదనీ, తనకు సాయం చేయాలని వేడుకుంటోంది. తను పెద్దపెద్ద నటుల సినిమాల్లో నటించాననీ, వారిలో ఎవరైనా పెద్దమనసు చేసుకుని తనకు సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఒకవేళ సాయం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోతే ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమని చెప్పారు.