ఎవరు మీలో కోటీశ్వరులు షోకి ఎన్టీఆర్ బైబై..!

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (12:28 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షో టిఆర్పి రేటింగ్ పెంచడానికి మొదట్లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను బయట పెట్టి చూసేవారికి ఆసక్తికరంగా చేశారు. 
 
అయితే కాలం గడిచేకొద్దీ ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతూ ఉండడంతో.. ఆ తర్వాత సెలబ్రిటీలను ఈ షో కి తీసుకొచ్చి టిఆర్పి రేటింగ్ సాధించడానికి ప్రయత్నం చేశారు.. అందులో భాగంగానే రామ్ చరణ్ , రాజమౌళి, కొరటాల శివ, సమంత లాంటి స్టార్ సెలబ్రెటీలు ఈ షోకి హాజరైన విషయం తెలిసిందే.
 
అంతే కాదు ప్రముఖ సంగీత దర్శకులు ఎస్.ఎస్.థమన్, దేవి శ్రీ ప్రసాద్ కూడా త్వరలోనే ఈ షోకి హాజరవుతున్న విషయం తెలిసిందే. ఇక వీరి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మిల్క్ బ్యూటీ తమన్నా కూడా హాజరు కాబోతున్నారు. 
 
మొత్తం ఎవరు మీలో కోటీశ్వరులు షోకి 60 ఎపిసోడ్‌లను ఎన్టీఆర్ విజయవంతంగా షూటింగులు పూర్తి చేశారట. మొత్తం 60 ఎపిసోడ్ లకు గాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ అక్షరాల రూ.7.50 కోటి అందుకున్నట్లు సమాచారం. 
 
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మల్టీస్టారర్ మూవీ ఆర్. ఆర్. ఆర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని, ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. 
 
అయితే ఆ సినిమా చేసే ముందే ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ షో కి సంబంధించిన 60 ఎపిసోడ్‌లు కూడా పూర్తయ్యాయి కాబట్టి త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments