పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పోటీగా పెరిగిన వంటనూనె ధర.. త్వరలో దిగిరానుందని సమాచారం. కాగా గడిచిన 8 నెలల్లో లీటర్ వంటనూనెపై ఏకంగా 90 రూపాయాలు పెరిగింది.
ఓ వైపు గ్యాస్ ధరలు మరోవైపు వంటనూనె ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ రెంటి ధరల పెరుగుదలతో హోటల్స్ ఆహార పదార్థాల రేట్లను భారీగా పెరిగాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోయాబీన్, సన్ ఫ్లవర్, ముడి పామ్ ఆయిల్ పై బేసిక్ కస్టమ్స్ సుంకం రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. మార్చి 2022 వరకు వీటిపై విధిస్తున్న అగ్రిసెస్ కూడా తొలగించాలని నిర్ణయించింది. దీంతో వంట నూనె ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఈ ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు అక్టోబర్ 14 నుంచి మార్చి 31, 2022 వరకు అమల్లోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దసరా పండుగ సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.