Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై దృష్టిసారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (15:10 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగుచూసిన మాదకద్రవ్యాల కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఈడీ నిర్ణయించింది. ఈ మేరకు కోర్టులో ఈడీ ఫిర్యాదు చేయడంతో ఈ అంశం మరోమారు చర్చనీయాంశంగా మారింది. 
 
గతంలో ఎక్సైజ్ శాఖ జరిగిన విచారణపై ఈడీ అధికారులు పూర్తి అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందుకే మరింత లోతుగా దర్యాప్తు చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుని కోర్టుకు తెలిపినట్టు ఉన్నారు.
 
ముఖ్యంగా, డ్రగ్ ఫెడ్లర్‌తో సంబంధం ఉన్న వారి మొబైల్ కాల్ జాబితాను సేకరించి పరిశీలించాలని ఈడీ భావిస్తుంది. అంతేకాకుండా ఎక్సైజ్ అధికారుల వ్యవహారశైలిపై కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. 
 
కాగా, ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే అనేక మంది ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా, హైదరాబాద్ నగరానికి చెందిన బడా పారిశ్రామికవేత్తలు, సినీ సెలెబ్రిటీల పేర్లు ఉన్నాయి. అలాగే, మరికొందరు వ్యాపారులు హవాలా మార్గంలో నిధుల మళ్లింపుపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments