Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడు సెక్సీ స్వామీజీ... ఇలా అస్తమించాడు... వినోద్ ఖన్నా రజనీష్ ఆశ్రమంలో...?

క్యాన్సర్‌తో పోరాడి ఓడిన అలనాటి మేటి బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా అప్పట్లో సూపర్‌స్టార్ అమితాబ్‌తో పోటాపోటీగా హిట్లు కొట్టి, ఎంతో మంది అభిమానాన్ని పొందాడు. అలాగే కొనసాగి ఉంటే ఆయన ఏ రేంజిలో సక్సెస్ అయ్యేవాడో కానీ, ఓషో రజనీష్ పట్ల ఆకర్షితుడై సినిమాలకు గ

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (19:09 IST)
క్యాన్సర్‌తో పోరాడి ఓడిన అలనాటి మేటి బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా అప్పట్లో సూపర్‌స్టార్ అమితాబ్‌తో పోటాపోటీగా హిట్లు కొట్టి, ఎంతో మంది అభిమానాన్ని పొందాడు. అలాగే కొనసాగి ఉంటే ఆయన ఏ రేంజిలో సక్సెస్ అయ్యేవాడో కానీ, ఓషో రజనీష్ పట్ల ఆకర్షితుడై సినిమాలకు గుడ్‌బై చెప్పేసాడు.
 
వివాదాస్పద నినాదంతో శృంగార లీలలకు ఆలవాలమైన రజనీష్ ఆశ్రమానికే పూర్తిగా అంకితమైపోయిన వినోద్ ఖన్నా అక్కడే విలాసజీవితాన్ని గడుపుతూ కుటుంబానికి సైతం దూరమయ్యారు. ఆ ఆశ్రమంలో ఆయన్ని సెక్సీ స్వామీజీ, స్వామి వినోద్ భారతి వంటి పేర్లతో  పిలిచేవారు. పోలీసులు, ప్రభుత్వం ఒత్తిళ్లతో భారతదేశం నుండి అమెరికాకు మకాం మార్చేసిన రజనీష్‌తో పాటు వెళ్లిపోయిన వినోద్ ఖన్నా అక్కడే అతని సేవలు చేసుకుంటూ కాలం గడిపేసాడు. రజనీష్ బట్టలు ఉతికానని, చెట్లకు నీరు పోసేవాడినని స్వయంగా వినోద్ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
 
రజనీష్ ఆశ్రమంలో ఎయిడ్స్ కారణంగా కొందరు చనిపోవడంతో అమెరికా కూడా రజనీష్‌‌ను భారత్‌కు నిర్బంధంగా పంపేసింది. ఆయనతో పాటే తిరిగి భారత్‌కు తిరిగి వచ్చిన వినోద్ తిరిగి 1987లో రీఎంట్రీ ఇచ్చారు. కానీ అప్పటికే సూపర్‌స్టార్ ఇమేజ్‌ పొందిన అమితాబ్‌కే ఎక్కువ అవకాశాలు వెళ్లిపోతుండటంతో అంతగా సక్సెస్ కాలేకపోయారు. 
 
ఎన్నో కలలతో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి, ఎంతో డబ్బు, సెలబ్రిటీ హోదాను సంపాదించుకుని, రజనీష్ మాయతో కొన్నేళ్లు వ్యర్థంగా గడిపి, చివరికి క్యాన్సర్‌తో చేసిన పోరాటంలో ఓడి తుదిశ్వాస విడిచారు వినోద్ ఖన్నా అలియాస్ సెక్సీ స్వామీజీ అలియాస్ స్వామి వినోద్ భారతి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అందంగా అలంకరించి.. అంతమొదించారు.. ఓ కుటుంబం ఆత్మహత్య!

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

140 రోజుల పాటు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం