Webdunia - Bharat's app for daily news and videos

Install App

జులై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఏమైపోతానే చిత్రం

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (17:44 IST)
Amar Lathu, Chandini Pournami
అమర్ లతు, చాందిని పౌర్ణమి హీరో హీరోయిన్ లుగా  నటిస్తున్న చిత్రం ఏమైపోతానే. ఈ సినిమా లో విజయ్  రామ్, జె. నరేష్ రెడ్డి , శివ నరిశెట్టి, సరిపల్లి సతీష్, సుజాత, మహేంద్ర నాథ్, భలే రావు, రవళి తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగా యూ/ఏ సర్టిఫికెట్ అందుకుంది. సురేష్ కుమార్ కుసిరెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా కి వసంత్.జి సంగీతం సమకూర్చారు. కె. వెంకటేష్ సినిమాటోగ్రాఫర్ గా చేయగా శివ శార్వాణి ఎడిటింగ్ అందించారు. కాగా ఈ సినిమా జులై 1వ తేదీన విడుదల అవుతుంది. 
 
ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత *సురేష్ కుమార్ కుసిరెడ్డి* మాట్లాడుతూ.. ప్రేమకథా సినిమా గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని భావిస్తున్నాను. పాటలకు ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల ప్రీమియర్ షో కి వచ్చిన రెస్పాన్స్ కూడా మర్చిపోలేనిది. ఆరోజు అందరి స్పందన నాకు ఈ సినిమాపై మంచి కాన్ఫిడెన్స్ ను పెంచింది. ఈ సినిమా లో మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమాలో నటించిన, పనిచేసిన అందరు కూడా ఎంతో బాగా సపోర్ట్ చేశారు. జులై 1 న ఈ చిత్రం అందరి ముందుకు రాబోతుంది. అన్నారు. 
 
నటీనటులు
 అమర్ లతు, చాందిని పౌర్ణమి, విజయ్  రామ్, జె. నరేష్ రెడ్డి , శివ నరిశెట్టి, సరిపల్లి సతీష్, సుజాత, మహేంద్ర నాథ్, భలే రావు, రవళి తదితరులు
 
సాంకేతిక నిపుణులు
నిర్మాత - సురేష్ కుమార్ కుసిరెడ్డి
రచన, దర్శకత్వం - సురేష్ కుమార్ కుసిరెడ్డి  
మ్యూజిక్ - వసంత్.జి
సినిమాటోగ్రఫీ - కే .వెంకటేష్
ఎడిటర్ - శివ శార్వాణి
కో - డైరెక్టర్ - నాని బాబు
డిఐ - ఆర్యన్ మౌళి (ఆర్ట్ కలర్ ల్యాబ్)
మిక్సింగ్ - విష్ణు (కార్తికేయ స్టూడియో)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

ఏపీ లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు - స్వాగతించిన బీజేపీ

అక్రమ సంబంధాన్ని ప్రియుడి భార్యకు చెప్పాడనీ విలేఖరి హత్యకు మహిళ కుట్ర!!

అట్టహాసంగా మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments