Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాలు ఆరబోసినా అచ్చిరాలేదు... హారర్ చిత్రాలపై దృష్టి పెట్టిన హీరోయిన్

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (14:00 IST)
కుర్రకారును రెచ్చగొట్టేలా వెండితెరపై అందాలు ఆరబోసినా ఏమాత్రం అచ్చిరాలేదు. దీంతో అవకాశాలు సన్నగిల్లాయి. ఈ పరిస్థితిని అధికమించేందుకు ఆ హీరోయిన్ సరికొత్త పంథాను ఎంచుకుంది. ఆ హీరోయిన్ పేరు ఈషా రెబ్బా. 
 
వాస్తవంగా చెప్పాలంటే తెలుగు తెరకు పరిచయమైన కుర్రకారు హీరోయిన్లలో ఈషా ఒకరు. తన అందాలతో ప్రతి ఒక్కరి దృష్టిలో పడింది. సౌందర్య .. స్నేహ తర్వాత చక్కని నవ్వుతో కుర్రకారు హృదయాలను దోచేసింది. ప్రేమకథా చిత్రాలను చేస్తూ వస్తున్నప్పటికీ, ఈషా రెబ్బాకి అనుకున్న స్థాయిలో క్రేజ్ రాలేదనే చెప్పాలి. ఆ క్రేజ్‌ను అందుకునే పాత్రలు కూడా ఆమెకి పడలేదు.
 
అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఈషా రెబ్బా, తాజాగా ఒక హారర్ థ్రిల్లర్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. 'ఢమరుకం' ఫేమ్ శ్రీనివాస రెడ్డి హారర్ థ్రిల్లర్‌గా సాగే ఒక కథను సిద్ధం చేసుకుని ఇటీవల ఈషా రెబ్బాకి వినిపించాడట. 
 
ఆ కథ ఆమెకి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు. నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమా కావడం కూడా ఆమె అంగీకరించడానికి మరో కారణమని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments