Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా మరోసారి రాజకీయ నాయకుడిగా?

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (13:53 IST)
తొలి చిత్రం ‘లీడర్‌’తోనే మెప్పించిన రానా దగ్గుబాటి ఆ తర్వాత నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’తో మరో విజయాన్ని అందుకోవడంతో రాజకీయం నేపథ్యంలో సాగే కథలు ఆయనకి బాగా కలిసొచ్చాయనే టాక్ ఇండస్ట్రీలో నాటుకుపోయింది. 
 
ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే మరో చిత్రంలోనూ రాజకీయ నాయకుడిగా ఖద్దరు దుస్తులు ధరించనున్నారని సమాచారం. ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమాతో పరిచయమైన దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రానికి ‘విరాటపర్వం’ అనే టైటిల్ ఖరారు కానుందట. తొలి చిత్రంతోనే విమర్శకుల మెప్పు పొందిన వేణు, ఎమర్జెన్సీ నేపథ్యంలో బలమైన కథని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 
 
కాగా, ఇందులో రానాకి జంటగా సాయిపల్లవి జంటగా నటించనున్నారు. ప్రజాస్వామ్యం, మార్క్సిజం, మానవ హక్కులు తదితర విషయాల్ని స్పృశిస్తూ సాగే చిత్రమని సమాచారం. డి.సురేష్‌బాబు నిర్మించనున్న ఈ సినిమా... జులై నెలలో పట్టాలెక్కనుంది. 
 
కాగా ఈ సినిమాకి సంబంధించిన కథ... ఎమర్జెన్సీ నేపథ్యంలో మొదలై, 1992తో ముగుస్తుందని సమాచారం. ప్రముఖ నటి టబు కూడా ఈ చిత్రంలో మానవ హక్కుల కార్యకర్తగా బలమైన పాత్రలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా... త్రిపురనేని సాయిచంద్‌ కూడా ఓ పాత్రలో నటిస్తారు. ముచ్చటగా మూడోసారి రాజకీయ నాయకుడిగా నటించనున్న రానాకి ఈ సినిమా ఎంత మాత్రం విజయాన్ని అందజేస్తుందో వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments