Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్‌ను బట్టలిప్పి కొడతాం... ఎందుకు?

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ చాలా రోజుల గ్యాప్ తరువాత దువ్వాడ జగన్నాథం పేరుతో కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గబ్బర్ సింగ్ సినిమాతో మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్న హరీష్‌ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ నెల సినిమాను రిలీజ్ చ

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (14:11 IST)
స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ చాలా రోజుల గ్యాప్ తరువాత దువ్వాడ జగన్నాథం పేరుతో కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గబ్బర్ సింగ్ సినిమాతో మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్న హరీష్‌ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ నెల సినిమాను రిలీజ్ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారు.
 
అయితే సినిమాకు ముందు ఒక టీజర్‌ను రిలీజ్ చేశారు. అందులో గుడిలో, బడిలో పాటను రిలీజ్ చేశారు. ఇక అప్పటి నుంచి ప్రారంభమైంది గొడవ. బ్రాహ్మణుడిని కించపరిచే విధంగా ఉండటమే కాకుండా రౌద్రస్తోత్రం లోని నమకం, చమకం పదాలను శృంగార కీర్తనలుగా మార్చారంటూ ఆగ్రహంతో ఊగిపోయాయి బ్రాహ్మణ సంఘాలు. 
 
అప్పుడెప్పుడో అదుర్స్, ఆ తరువాత దేనికైనా రెడీ, ఇప్పుడు దువ్వాడ జగన్నాథం. ఇలా బ్రాహ్మణుడిని కించపరుస్తూ తీసే చిత్రాలే ఎక్కువ. అదుర్స్, దేనికైనా రెడీ తరువాత బ్రాహ్మణులపై చిత్రాలు తీసినా కించపరిచే విధంగా ఉండదని భావించారు. కానీ దువ్వాడ జగన్నాథం సినిమా అందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. అల్లుఅర్జున్ బ్రాహ్మణుడి పాత్రలో కనిపిస్తుండగా అతను చేతిలో గరిట పెట్టుకుని.. వంట చేసే వాడిగా.. స్టైల్‌గా గరిట తిప్పుతూ కనిపిండచమే వివాదానికి తెరతీస్తోంది. 
 
అంతేకాదు రౌద్ర స్తోత్రంలోని రెండు పదాలు ఎంతో శక్తివంతమైనవి. అదే నమక, చమకాలు. వాటిని హీరోహీరోయిన్లకు మధ్య జరిగే శృంగార కీర్తనల్లో కలపడంపై మరింత ఆగ్రహంతో ఊగిపోతున్నాయి బ్రాహ్మణ సంఘాలు. అల్లు అర్జున్, హరీష్ శంకర్ ఇద్దరినీ బట్టలూడదీసి కొడతామని హెచ్చరిస్తున్నారు. వెంటనే ఆ రెండు పదాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. 
 
అయితే ఇప్పటికే దీనిపైన వివరణ ఇచ్చిన దర్శకుడు సినిమా విడుదలైన తరువాత మొత్తాన్ని చెబుతానని అంటున్నారు. అయితే దీనిపై ఏ మాత్రం తగ్గడం లేదు బ్రాహ్మణ సంఘాలు. సినిమాను అడ్డుకొని తీరుతామని హెచ్చరిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments