Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగి తాగి గొంతు మండింది - మనిషికి శృంగారం కూడా ముఖ్యమే : వరుణ్ తేజ్ అనుభవాలు

డీవీ
శనివారం, 9 నవంబరు 2024 (15:33 IST)
Varun Tej
వరుణ్ తేజ్ మాస్ మూవీ 'మట్కా'. నవంబర్ 14 న థియేటర్లలోకి రానుంది. వైర ఎంటర్‌టైన్‌ మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ సాంగ్స్, టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.
 
ఈ సినిమా షూటింగ్ లో తన అనుభవాలను వరుణ్ తేజ్ ఇలా తెలియజేస్తున్నారు. బర్మా నుంచి ఇండియా వచ్చిన వ్యక్తిగత ఇది. 1958నాటి కాలంనాటిది. పలు షేడ్స్ వున్న పాత్రలు పోషించాను. ముఖ్యంగా డాన్ గా చేసే పాత్ర సిగార్స్ తాగుతుంటుంది. దానికోసం ఒక్కోసారి ఒరిజినల్ సిగార్ తాగాల్సివచ్చింది. మిగిలిన షాట్స్ లో ఆయుర్వేదంకు చెందిన సిగరెట్లు తాగాను. షాట్ షాట్ కు మరోటి కాావాలి. అందుకే తాగి తాగి గొంతు మండిపోయింది. ఇన్ ఫెక్షన్ రాకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నానని చెప్పారు.
 
ఈ కథ విన్నతర్వాత షాట్ గ్యాప్ లో యాభైమంది వరకు కూర్చుని సినిమా గురించి చర్చించుకొనేవాళ్ళం. ఈ యాభై మందికి నచ్చితే కోట్ల మంది చేరువవుతుంది. ఈ విషయంలో దర్శకుడు చాలా సహకరించాడు. కొన్ని డైలాగ్స్ లు స్పాన్ టేనియస్ గా ఆయన చెప్పారు. అలా చెప్పిందే.. ట్రైలర్ నేను చూపిస్తూ చెప్పిన మైండ్, గుండె, కిందపార్ట్.. ఇది పాలిష్ గా చెప్పడానికి వీలులేదు. 
 
ఆ పాత్ర చాలా రఫ్ గా పెరిగి వచ్చింది కనుక అలా మాట్లాడాలి. ఏ మనిషి అయినా ఆ మూడింటి మీద కంట్రోల్ వుండాలి. అప్పుడే ఏదైనా సాధిస్తాడు. ఆ కోణంలో దర్శకుడు రాసిన డైలాగ్ అది. నాకు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ ఈ మూడింటిమీద కంట్రోల్ వుండబట్టే ఇంతదూరం రాగలిగాను. దీనిని నెగెటివ్ గా ఆలోచించకూడదు. పాత్ర చాలా మాస్. అందుకై మైండ్, గుండె ధైర్యం, సెక్స్ పార్ట్ అంటూ అలా చూపిస్తూ ఆ డైలాగ్ చెప్పాల్సి వచ్చింది అంటూ వివరించారు. దీనిపై ఫ్యాన్స్ నుంచి కూడా ఎటువంటి నెగెటివ్ కామెంట్ లేదు. కాకపోతే సెన్సార్ యుఎ సర్టిఫికెట్ ఇచ్చింది అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం