Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి ఎందుకు `మా`కు రాజీనామా చేశారో తెలుసా!

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (20:53 IST)
Chiranjeevi ph
మెగాస్టార్ చిరంజీవి సినిమా రంగానికి పెద్ద దిక్కుగా వున్నారు. అలా వుండ‌మ‌ని సినిమా పెద్ద‌లు ఆయ‌న్ను కోరారు. ఇది స‌త్యం. ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు మ‌ర‌ణానంత‌రం ప‌రిశ్ర‌మ‌లో వున్న అంత‌రాలు, స‌మ‌స్య‌ల‌కు పెద్ద దిక్కుగా వుండ‌మ‌ని సి.క‌ళ్యాణ్‌తోపాటు ప‌లువురు కోరారు. ఆ త‌ర్వాతే ఆయ‌న ముందుడ‌గు వేశారు. ఆ స‌మయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ త‌ర్వాత `మా` ప‌నితీరుపై ఒకే పేన‌ల్‌లో వున్న డా. రాజ‌శేఖ‌ర్ రెడ్డితోపాటు ప‌లువురు అధ్య‌క్షుడు సీనియ‌ర్ న‌రేశ్‌పై విమ‌ర్శ‌లు కురిపించారు. అవి వాస్త‌వాల‌ను ఆయ‌న బ‌ల్ల‌గుద్ది చెప్పారు. అయితే ఈ పేచీకు మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించ‌డానికి వ‌చ్చిన చిరంజీవి, మోహ‌న్‌బాబు ఇత‌ర పెద్ద‌ల స‌మ‌క్షంలో డా. రాజశేఖ‌ర్ తీరు పెద్ద‌ల‌ను అగౌర‌ప‌రిచేదిగా వుండ‌డంతో అప్ప‌టిక‌ప్పుడు రాజ‌శేఖ‌ర్‌పై యాక్ష‌న్ తీసుకునేలా చ‌ర్య‌లు జ‌రిగాయి. 
 
ఇది జ‌రిగి చాలా కాలం అయింది. మ‌ర‌లా `మా` ఎన్నిక‌లు జ‌ర‌గాల్సివుంది. ఏడాదిన్న‌ర‌పైగా కాల‌ప‌రిమితి పూర్త‌యింది. ఆ స‌మ‌యంలో క‌రోనా వ‌ల్ల ఎన్నిక‌లు వాయిదా వేశారు. అయితే అంత‌కుముందు ప్ర‌తి ఏడాది మా డైరీ అనేది విడుద‌ల చేయ‌డం ఆన‌వాయితీ. అది సీనియ‌ర్ న‌రేశ్ మా అధ్య‌క్షుడు అయ్యాక అస్స‌లు జ‌ర‌గ‌లేదు. దీనికితోడు ఆయ‌న మా కార్యాల‌యానికి స‌రిగ్గారావ‌డంలేదనీ, బీద క‌ళాకారుల ఫించ‌న్లు ఇత‌ర వాటిపై చెక్‌ల‌పై సంత‌కాలు చేయ‌డంలేదు. మ‌ర‌లా న‌రేష్ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ ఆయ‌న అటువంటివి ఏమీ ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తానుచేసుకుంటూ పోతున్నారు. దీనితోపాటు ప‌లు స‌మ‌స్య‌లు పెండింగ్‌లో వున్నాయి. ఈ విష‌యంలో సీనియ‌ర్ న‌రేష్ పెద్ద‌లు చెప్పిన‌ట్లు అసోసియేష‌న్‌ను స‌రిదిద్దుకోవ‌డంలో విఫ‌లం అయ్యాడ‌ని సాటి క‌మిటీ మెంబ‌ర్లు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. 
 
ఓ ద‌శ‌లో తాత్కాలిక అధ్య‌క్షుడిగా న‌టుడు బెన‌ర్జీకూడా వుండి వ్య‌వ‌హారాలు చూసుకున్నారు. దానికితోడు సీనియ‌ర్ న‌రేష్ తాను అధ్యక్షుడు అయ్యాక పేద క‌ళాకారుల వివ‌రాలు సేక‌రించి వారికి మ‌రింత సేవ చేయ‌డానికి కొంత‌మంది టీమ్‌ను పెట్టి వివ‌రాలు సేక‌రించాడు. అవి మ‌ధ్యంత‌రంగా ఆగిపోయాయి. ప్ర‌స్తుతం సీనియ‌ర్ న‌రేష్ ఎవ‌రికీ స‌హ‌క‌రించ‌డంలేద‌నీ వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇందుకు కార‌ణం ఆయ‌న అహం ఎక్కువ‌గా వుంద‌ని సాటివారే ఆరోపిస్తున్నారు.

మా లో ఏదైనా స‌మ‌స్య వ‌స్తే అందుకు క్ర‌మ‌శిక్ష‌నా సంఘం అధ్య‌క్షుడిగా చిరంజీవి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కానీ ఆయ‌న మాట చెల్లుబాటు కాక‌పోవ‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల‌లో రాజీనామా చేశారు. దీనిపై మాలోని దాదాపు అంద‌రూ బాధ‌ను వ్య‌క్తం చేస్తూ అస‌లు `మా` అసోసియేష‌న్ ఏర్పాటుకు కార‌కులైన మీరే లేక‌పోతే ఏమిట‌ని ఆయ‌న ముందు వాపోయారు. ఏదైనా కాల‌మే ప‌రిష్కారం చూపిస్తుంద‌నే విధంగా ఆయ‌న స్పందించార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సైబర్ క్రైమ్: వాట్సాప్ పోస్టులు ఫార్వర్డ్ చేసినా నేరమేనా, ఎలాంటి పోస్టులు నేరమవుతాయి?

అప్రమత్తంగా ఉండండి: సహజ వాయువు పైప్‌లైన్‌ల తవ్వకం, నాశనం చేస్తే చట్టపరమైన చర్యలు

దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు.. ఎందుకంటే.. పవన్‌పై అలా?

కారం, పసుపు ఎక్కువగా తింటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

DCM రక్షణ బిల్లు ఎవరికోసం.. ఆ భాష ఏంటండీ బాబూ.. చదవలేకపోతున్నాను.. శ్యామల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments