మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో నటించడం మినహా కుటుంబంతో కలిసి చూసే అవకాశం చాలా అరుదు. చెన్నైలో వుండగా ప్రివ్యూ షోలకు వెళ్ళేవారు. ఆ తర్వాత హైదరాబాద్ షిప్ట్ అయ్యాక చాలా తక్కువసార్లు సినిమాలు చూడడం జరుగుతుంది. ఆయన చూడాలనుకుంటే ప్రత్యేకమైన షో ప్రదర్శించేవారు. కాగా, ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా `వకీల్‌సాబ్` గురించి రచ్చ జరుగుతోంది. ఎక్కడా చూసినా అభిమానులు ఆయన సినిమా కోసం ఎదరుచూస్తున్నారు. కేవలం ట్రైలర్ రిలీజ్ చేస్తేనే చాలా ప్రాంతాల్లలో థియేటర్లలో అద్దాలు బద్దలయిపోయాయి. ఇక సినిమా విడుదల తర్వాత బాక్స్ బద్దలవుతుందని ఇండికేషన్ ఇస్తుందని నిర్మాత దిల్‌రాజు ఇప్పటికే ప్రకటించారు.
ఇదిలా వుండగా, వకీల్‌సాబ్ సినిమా గురించి ప్రేక్షకులు ఎలా ఎదురుచూస్తున్నారో అంతకంటే ఎక్కువగా తాను ఎదురుచూస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశాడు. తమ్ముడికి మేకప్ వేస్తూ వున్న స్టిల్‌ను పెట్టి ట్విట్టర్ ఇలా రాశారు. చాలా కాలం తరువాత పవన్‌కళ్యాణ్‌ను వెండితెర మీద చూడటానికి మీలాగే నేనుకూడా ఎదురుచూస్తున్నాను. అమ్మ, కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్ లో వకీల్‌సాబ్ చూస్తున్నాను. అంటూ పేర్కొన్నారు. ఇక ఇప్పటికే వకీల్‌సాబ్ ఫీవర్ అభిమానుల్లో నెలకొంది. రేపు ఎంత రేంజ్‌లో సినిమా వుంటుందో చూడాలి.