శ్రుతిమించిన శృంగారం వుంటేనే చూస్తారా!
, బుధవారం, 7 ఏప్రియల్ 2021 (17:05 IST)
చూస్తూ నేర్చుకుంటుంది. వేడెక్కితే చల్లార్చుకుంటుంది. బాగా కావాలనుకుంటే ఎవడినో చూసుకుంటుంది. అంటూ ఆ సినిమా గురించి యాంకర్ చెబుతుంది. ఆ తర్వాత మరో సీన్‌లో, కట్టిన బట్ట కట్టలేను. రోజూ ఒకడితో పడుకోలేను.. అంటూ మరో వ్యక్తితో ఎంజాయ్ చేస్తూ సాగే శృంగార సన్నివేశం వుంటుంది. ఇలా పలు సన్నివేశాలు ఆ సినిమా అంతా నిండిపోయింది. టీజర్ చూస్తేనే ఇలా వుందంటే సినిమా చూస్తే ఎలా వుంటుందో. అసలు దీనికి సెన్సార్ ఇస్తారా, అనే అనుమానం ఎవరికైనా వుంటుంది. స్ట్రీట్ లైట్ అనే సినిమాట్రైలర్ అండ్ లిరికల్ వీడియో సాంగ్ చూశాక ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. కానీ ప్రముఖ నిర్మాత తుమ్మల రామసత్యనారాయణకు మాత్రం ఇది పాన్ ఇండియా మూవీగా అనిపించింది. ఇలాంటి సినిమాలు రావాలి. సినిమా ఎవరినీ ఉద్దరించడానికి తీయడంలేదు. మనల్ని మనం ఉద్దరించుకోవాలని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇది బుధవారం ఛాంబర్‌లో స్ట్రీట్ లైట్ ట్రైలర్ ఆవిష్కరణలో జరిగింది.
అనంతరం ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ఘాటుగానే స్పందించారు. సాంగ్ చూసాం. చాలా బాగుంది. రామ సత్యనారాయణ పాన్ ఇండియా అంటున్నారు. ఇది హాలీవుడ్ కు వెళ్లినా బాగుంటుందేమో అని నా అభిప్రాయం. నిర్మాత శ్రీనివాస్ మంచి థాట్స్ తో ఈ సినిమా తీశారు.. కానీ సెన్సార్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మరి. ఇక ఈ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను మించిపోయారు అని చెప్పాలి. అసలు సినిమా అనేది పదిమందికి ఉపయోగపడేలా వుండాలి. శృంగారం చూపించవచ్చు. కానీ మితిమీరకూడదు. దర్శక నిర్మాతలకు కసివుంటే మంచి సినిమా తీసి చూపించాలి. ఇలాంటి సినిమాలు తీసి థియేటర్లలో విడుదల చేయకూడదు. ఓటీటీలో విడుదల చేయండి. ఏదిఏమైనా సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేయాలి. ఇలాంటి సినిమాలు కాదంటూ అందరికీ చురక వేశారు.
తర్వాతి కథనం