Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిసింద్రీ టు ఏజెంట్‌గా అఖిల్ ప్ర‌యాణం

సిసింద్రీ టు ఏజెంట్‌గా అఖిల్ ప్ర‌యాణం
, గురువారం, 8 ఏప్రియల్ 2021 (10:43 IST)
Akhil ph
అఖిల్ న‌టుడిగా 1995లో సిసింద్రీ సినిమాకు బాల‌న‌టుడిగా తెరంగేట్రం చేశాడు. ఆయ‌న పుట్టింది ఏప్రిల్ 8 1994. న‌ట‌వార‌సుడిగా అక్కినేని నాగేశ్వ‌ర‌రావు కుటుంబం కొండంత అండ‌గా వుంది. అక్కినేని నాగార్జున, అమల అక్కినేని ల కుమారుడు. అఖిల్ కాలిఫోర్నియాలోని సాన్ జోస్ లో జన్మించాడు. ఆస్ట్రేలియాలో చదువును రెండేళ్ళపాటు కొనసాగించి తిరిగివచ్చి హైదరాబాదులోని ఓయాక్రిడ్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో జేరాడు. ఆ త‌ర్వాత అఖిల్‌కు ఒక గోల్ వుంది. న‌టుడు అవ్వాల‌నేది ఇన్న‌ర్‌గా వుండేది. క్రికెట్‌కూడా బాగా ఆడేవాడు. క్రికెట‌ర్ చేయాల‌ని నాగార్జున‌కు వుండేది. కానీ కొన్ని కార‌ణాల‌వ‌ల్ల అది నెర‌వేర‌లేదు.

నాగార్జున కోరిక ప్ర‌కారం అన్న‌పూర్ణ స్టూడియోస్‌తోపాటు ప‌లు వ్యాపారాల‌ను చూసుకునేందుకు అఖిల్ తెలివితేట‌లు బాగా ఉప‌క‌రిస్తాయ‌ని నాగార్జున చ‌దివిన బిజినెస్ మేనేజ్‌మెంట్ అఖిల్‌తో చేయించాల‌ను వుండేది. కానీ న్యూయార్క్ లోని లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్ం ఇనిస్టిట్యూట్ లో నటనా కోర్సులో చేరాడు. అమ‌ల‌కు ఈ విష‌యం తెలిసినా ఆ త‌ర్వాత నాగార్జున‌కు చెప్పింది. ఇక చేసేదిలేక న‌టుడిగా మార్చాల‌నుకుని నాగార్జున ప్ర‌య‌త్నించాడు. అలాగే 16 వ యేట నుండి సినీ ప్రస్థానంలోనికి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. 
 
అలా కొడుకును త‌గిన‌విధంగా తీర్చిదిద్దేందుకు తెలుగు భాష ప్ర‌ధానం కాబ‌ట్టి చాలాకాలం తెలుగు త‌ర్ఫీదు ఇచ్చి స‌మ‌యం చూసి `మ‌నం` సినిమాలో క్ల‌యిమాక్స్‌లో వ‌చ్చే పాత్ర‌ను నాగార్జున ఇచ్చాడు. 2014 విడుద‌లైన మ‌నం సినిమా త‌న తాత నాగేశ్వ‌రావు న‌టించిన ఆఖ‌రి సినిమా. ఆ సినిమా అనంత‌రం అఖిల్‌ను ఆప్యాయంగా ద‌గ్గ‌ర‌కు తీసుకుని వీడు యూత్‌ఫుల్ స్టార్‌గా ఎదుగుతాడ‌ని కితాబిచ్చాడు. ఇక అఖిల్‌కు స‌రైన క‌థ కోసం వెతుకుతూండ‌గా ప్ర‌ముఖ వ్యాపార సంస్థ‌లు అఖిల్ ఫీచ‌ర్‌ను చూసి ప్ర‌క‌ట‌న‌లో ఉప‌యోగించుకునా్న‌రు. వ్యాపార ప్రకటనల అడ్వర్‌టైజ్ మేంట్స్ లో కల్కి కొచ్చిన్తో కలసి కార్బన్ ఫోన్, మౌంటైన్ డ్యూ, టైటాన్ వాచ్ లలో నటించాడు. ఇవి అఖిల్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే క్లాసిక్‌గా క‌నిపించే అఖిల్‌కు మాస్ త‌ర‌హాల పాత్ర‌లు క‌ష్ట‌మ‌ని గ్ర‌హించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌‌రావు కూడా త‌గు స‌ల‌హాలు ఇచ్చారు.
 
కానీ మాస్ హీరోగా చేయాలనే ప‌ట్టుద‌ల‌తో ఎట్ట‌కేల‌కు వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో 2015లో `అఖిల్‌` అనే సినిమా చేశాడు. కానీ అది ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌క‌పోగా క‌న‌ప‌బ‌డ‌ని అతీంద్రియ‌శ‌క్తులు కాన్సెప్ట్ ద‌ర్శ‌కుడు టేకింగ్ చూశాక బ‌ల‌వంతంగా క్లాస్ హీరోను మాస్ మెరుగులు దిద్దార‌నే విమ‌ర్శ‌లు బాగా వినిపించాయి. దాంతో ప‌రిస్థితి అర్థ‌మ‌యిన నాగార్జున త‌న రూటులో ర‌మ్మ‌ని ఆరంభంలో త‌ను చేసిన ప్రేమ‌సినిమాలు, నాన్న‌గారు చేసిన సినిమాల గురించి చెబుతూ త‌గు విధంగా మార్చాడు. ఈ క్ర‌మంలో 2016లో ఆటాడుకుందాంరా అనే సినిమాలో గెస్ట్‌గా న‌టించాడు. అది కూడా పెద్ద‌గా గుర్తింపు తీసుకురాలేదు. అనంత‌రం 2017లో `హ‌లో` అంటూ ముందుకు వ‌చ్చాడు. కానీ ప్రేక్ష‌కులు హ‌లో అంటే రిప్ల‌యి ఇవ్వ‌లేక‌పోయారు. మ‌ర‌లా 2019లో నాన్న న‌టించిన మ‌జ్ఞు త‌ర‌హాలో టైటి్ల్ పెట్టి మిస్టర్ మజ్నుతో ముందుకు వ‌చ్చాడు. అది ఏవ‌రేజ్ సినిమాగా నిలిచింది. అనంత‌రం మ‌ర‌లా కొన్ని వ్యాపార ప్ర‌క‌ట‌న‌లు చేసుకున్నాడు. 
 
తాజాగా కోవిడ్‌కుముందు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`గా అడుగువేశాడు. దానికి బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇది రొమాంటిక్ సినిమా అయినా కాస్త మాస్ ట‌చ్ కూడా వుంటుంద‌ని వినికిడి. ఆ భాగాన్ని ఇంత‌ర‌కుకు రిలీవ్ చేయ‌లేదు. ఈలోగా ఆయ‌న పుట్టిన‌రోజు ఏప్రిల్ 8 రానే వ‌చ్చింది. అందుకే తాజాగా ఆయ‌న రా ఏజెంట్‌గా న‌టించ‌బోయే సినిమా లుక్‌ను గురువారంనాడు చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో మోహ‌న్‌లాల్‌కూడా కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు. అఖిల్ అక్కినేని తన సినిమాల ఫలితాలకు సంబంధం లేకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్ కు మంచి అంచనాలు సెట్ చేసుకోగలడు. అలా తాను చేసిన లాస్ట్ మూడు చిత్రాలు కూడా సరైన హిట్ కాకపోయినా ఇప్పుడు చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ పై మంచి అంచనాలు ఉన్నాయి. మ‌రి నాగ్ వార‌సుడిగా మంచి పేరు తెచ్చుకుంటాడ‌ని వెబ్‌దునియా ఆకాంక్షిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అభిమానుల‌కు అమ్మాయిలకూ ధైర్యాన్నిచ్చిన‌‌ అల్లు అర్జున్(Video)