Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు జిమ్‌లో ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్ ఎవరో తెలుసా?

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2023 (21:00 IST)
Mahesh Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు అందం వయసుతో పాటు పెరుగుతూనే ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ యవ్వనంగా మారుతున్నారు. అయితే ఇలా హ్యాండ్సమ్‌గా కనిపించేందుకు మహేష్ చాలా కఠోర శిక్షణ తీసుకున్నాడట. 
 
జిమ్‌లో కఠినమైన వ్యాయామాలు చేస్తూ, బాడీ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ, డైట్ పాటిస్తూ.. యంగ్‌గా కనిపిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
 
మహేష్ ఇటీవల తన జిమ్ ట్రైనర్‌ను పరిచయం చేస్తూ ఓ క్యూట్ ఫోటో షేర్ చేయగా ఇప్పుడు అది వైరల్‌గా మారింది. ఇంతకీ మహేష్ బాబుకి జిమ్‌లో ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్ ఎవరో తెలుసా.. మహేష్ పెంపుడు కుక్క "స్నూపీ". 
 
తాజాగా మహేశ్ బాబు షేర్ చేసిన ఆ పిక్‌లో.. మహేష్ జిమ్‌లో వర్క్‌అవుట్‌లు చేస్తుండగా, స్నూపీ ఎదురుగా కూర్చుని మహేష్‌ని చూస్తోంది. 
 
కాగా మహేష్ ఇంట్లో ఫ్లూటో అనే కుక్క ఉండేది. కానీ అనారోగ్యంతో చనిపోయింది. దాంతో మహేష్ ‘స్నూపీ’ని దత్తత తీసుకుని అప్పటి నుంచి స్నూపీతో ఉన్న ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటున్నాడు. 
 
మరో ఫోటోలో మహేష్ స్నూపీని పట్టుకుని కనిపిస్తున్నాడు. ఉదయాన్నే ప్రారంభించడానికి స్నూపీని ముద్దు పెట్టుకోవడం కంటే మంచి మార్గం లేదని మహేష్ రాశాడు. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. 
 
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2024 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఏఎన్నార్ వర్చువల్ స్టూడియోలో జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు- చైనాను అధిగమించిన భారతదేశం

ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments