Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ స్పెషల్స్ అవికా గోర్ నటించిన వధువు వెబ్ సిరీస్

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (16:32 IST)
Avika Gore
సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ అందిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ "వధువు". ఈ వెబ్ సిరీస్ లో అవికా గోర్, నందు, అలీ రెజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ను ఎస్వీఎఫ్ బ్యానర్ లో శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మిస్తున్నారు. పోలూరు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 8వ తేదీ నుంచి "వధువు" వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఇవాళ ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
 
"వధువు" వెబ్ సిరీస్ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే...'వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు. కానీ ఈ పెళ్లిలో అన్నీ రహస్యాలే అంటూ పెళ్లి కూతురు ఇందు చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఆనంద్ ను పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిన ఇందుపై వివిధ రకాలుగా హత్యా యత్నాలు జరుగుతుంటాయి. ఇవన్నీ అనుకోకుండా జరిగినట్లు కాకుండా.. ఎవరో కావాలని చేసినట్లే ఉంటాయి. అత్తవారింట్లో ప్రతిఒక్కరి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపిస్తుంటుంది. ఓ అపరిచిత క్యారెక్టర్ లోని మహిళ అసలైన ఆట ఇప్పుడే మొదలైంది అనడం...ఇందుకు రాబోతున్న ప్రమాదాలను సూచిస్తుంది. ఇందు ఈ మిస్టరీలోని నిజాల్సి తెలుసుకుందా..?ప్రశ్నలా మిగిలిన అత్తవారింటి ప్రవర్తన వెనుక కారణాలు కనుక్కుందా? అనే సందేహాలతో వధువు ట్రైలర్ ఆసక్తికరంగా  కంప్లీట్ అయ్యింది. వధువు వెబ్ సిరీస్ చూడాలనే క్యూరియాసిటీ ట్రైలర్ క్రియేట్ చేసింది.
 
నటీనటులు - అవికా గోర్, నందు, అలీ రెజా, వీఎస్ రూపా లక్ష్మి, మౌనిక, మాధవి ప్రసాద్, శ్రీధర్ రెడ్డి, అమ్మ రమేష్, కాంచన్ బమ్నే, కేఎల్ కే మణి, శ్రీదేవి అర్రోజు, సౌజాస్, ఇందు అబ్బే, సురభి పద్మజ, తులసీ శ్రీనివాస్, సురభి దీప్తి,  శుభశ్రీ రాయ్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments