Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య్‌భాస్క‌ర్ ద‌ర్శ‌క్వంలో ‘ఉషా ప‌రిణ‌యం’ ప్రారంభం

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (16:19 IST)
Srikamal, Tanvi Akanksha
తెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన కె.విజ‌య్‌భాస్క‌ర్ మ‌ళ్లీ ఓ స‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్టాడు. నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఉషా ప‌రిణ‌యం పేరుతో రూపొంద‌నున్న ఈ ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్రారంబోత్స‌వం శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. 
 
పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం హీరో, హీరోయిన్ల‌పై స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణతో రెగ్యుల‌ర్ షూటింషూటింగ్‌ను  మొద‌లుపెట్టారు ద‌ర్శ‌కుడు విజ‌య్‌భాస్క‌ర్‌. ఉషా ప‌రిణ‌యం అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొంద‌నున్న ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపైకె.విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో విజ‌య్‌భాస్క‌ర్ త‌న‌యుడు  శ్రీ‌క‌మ‌ల్ హీరోగా న‌టిస్తుండ‌గా,  హు ఈజ్‌ ఉషా అంటూ సోషల్‌ మీడియాలో జరిగిన చర్చను తెరదించుతూ తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ‌తెలుగ‌మ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతుందనే విషయాన్ని రివీల్‌ చేశారు.  
 
ఈ చిత్రంలో వెన్నెల‌కిషోర్‌, శివాజీ రాజా, ఆమ‌ని, సుధ‌, ఆనంద్ చ‌క్ర‌పాణి, ర‌జిత‌, బాల‌క్రిష్ణ‌, సూర్య, మ‌ధుమ‌ణి ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి సంగీతం : ఆర్ ఆర్ ధ్రువ‌న్‌, డీఓపీ: స‌తీష్ ముత్యాల‌, ఎడిటింగ్‌: ఎమ్ ఆర్ వ‌ర్మ‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు : మంత్రి నారా లోకేశ్

వైకాపాకు మరో షాక్ : మాజీ ఎమ్మెల్యే రెహ్మాన్ గుడ్‌‍బై.. జగన్‌కు లేఖ

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటికి ఏపీ హైకోర్టులో ఊరట - కేసు కొట్టివేత

చైనా డ్యామ్‌తో పొంచివున్న ప్రమాదం.. భూ గమనాన్ని ప్రభావితం చేస్తున్న త్రీ గోర్జెన్

మేకలను మేపుతున్న తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం.. ఐసీయూలో..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకుంటే.. అంత మేలు జరుగుతుందా?

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

ప్రపంచ హృదయ దినోత్సవం: బాదంపప్పులతో మీ హృదయాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచండి

తర్వాతి కథనం
Show comments