Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశా పటానీ.. మరో దిక్కు చూడనివ్వడం లేదు.. ఏమి హాట్ గురూ! (Photos & Video)

మెగా కాంపౌడ్ హీరో వరుణ్ తేజ్ నటించిన చిత్రం "లోఫర్". ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన దిశా పటానీ. మోడలింగ్‌తో తన కెరీర్‌ని ప్రారంభించింది. అలాగే, 'ధోనీ' బయోపిక్‌ చిత్రంతో బాలీవుడ్‌

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (11:12 IST)
మెగా కాంపౌడ్ హీరో వరుణ్ తేజ్ నటించిన చిత్రం "లోఫర్". ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన దిశా పటానీ. మోడలింగ్‌తో తన కెరీర్‌ని ప్రారంభించింది. అలాగే, 'ధోనీ' బయోపిక్‌ చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఈ అమ్మడు కెరీర్‌ దశ మారింది. జాకీచాన్‌తో కలిసి నటించిన 'కుంగ్‌ఫూ యోగా'తో అంతర్జాతీయ నటి స్థాయికి చేరిపోయింది.
 
దిశా పటాని 13 జూన్‌ 1992లో బరేలిలో జన్మించిన ఈమె ప్లస్‌ టూ పూర్తిచేసిన తర్వాత తన ఆలోచనలు మోడలింగ్‌ వైపుకి మారడంతో 19 యేటనే ముంబైకు చేరుకుంది. ఈమె ట్రెయిన్డ్‌ జిమ్నాస్ట్‌ కూడా. కెరీర్‌ మోడలింగ్‌తో ప్రారంభమైనా ఎక్కువమందికి తను గుర్తిండిపోయింది యాడ్స్‌తోనే. టీవీ కమర్షియల్స్‌తోనే కుర్రకారు మనసు దోచుకున్న ఈ అమ్మాయిని వెతుక్కుంటూ సినీ అవకాశాలు వచ్చేశాయి.
 
కెమెరా ముందుకు రాగానే ఎలాంటి బెరుకు లేకుండా ఫ్రీ అయిపోయేది. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా ఇండోర్‌లో మొదటి రన్నరప్‌గా నిలిచిన దిశాకి ఎమ్‌.ఎస్‌.ధోనీ బయోపిక్‌ 'ధోనీ'లో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో తొలి అవకాశం లభించింది. ఈ చిత్రం కోసం జార్ఖండ్‌ అదీవాసీలు మాట్లాడే అసురి మాండలికాన్ని నేర్చుకుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గినా మోడలింగ్‌, యాడ్స్‌లో అవకాశాలు తగ్గలేదు.
 
దిశా అభిమానుల్లో చిన్నారులెక్కువగా ఉండటం గమనార్హం. బబ్లీగా ఉండటం వల్లో లేదా టీవీ ప్రకటనల రూపంలో ఆమె రోజూ వారికి కనిపించి బాగా పరిచయమవడంవల్లో పిల్లలు ఆమెను ఎక్కువ ఇష్టపడతారు. జాకీచాన్‌కు దిశా హిందీ పాట నేర్పిస్తే... ఆయన చైనా పాటను పాడించే ప్రయత్నం చేశాడనే ప్రచారం ఉంది. హాలీవుడ్‌ హీరో టామ్‌ క్రూజ్‌తో ఓ సినిమా చేయాలనేది కలట.
 
అయితే సినిమాల్లో పెద్ద స్టార్‌ అయిపోవాలనే లేదట. కెరీర్‌ను, జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకుంటూ నటనను ఆస్వాదిస్తానని ఓ సందర్భంలో చెప్పింది. తాజాగా ఓ ఫ్యాషన్‌ షోలో ఆమె చేసిన ర్యాంప్ వాక్‌కు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి మోహం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం