Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోయిన్ రేటు రూ.5 కోట్లు...

టాలీవుడ్‌కు 'లోఫర్' చిత్రం ద్వారా పరిచయమైన భామ దిశా పటానీ. తక్కువ సమయంలో కథానాయికగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లో విజయవిహారం చేస్తోంది. అందుకేనేమో ఓ భారీ కోలీవుడ్ చిత్రానికి

Webdunia
సోమవారం, 2 జులై 2018 (10:56 IST)
టాలీవుడ్‌కు 'లోఫర్' చిత్రం ద్వారా పరిచయమైన భామ దిశా పటానీ. తక్కువ సమయంలో కథానాయికగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లో విజయవిహారం చేస్తోంది. అందుకేనేమో ఓ భారీ కోలీవుడ్ చిత్రానికి గాను ఆమె గట్టిగానే పారితోషికాన్ని డిమాండ్ చేస్తునట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం.
 
'లోఫర్' చిత్రం తర్వాత 'యమ్.యస్.ధోనీ', 'కుంగ్ఫూ యోగా', 'వెల్కమ్ టు న్యూయార్క్' వంటి చిత్రాల్లో నటించింది. తన ట్రేడ్ మార్క్ అందచందాల్ని ప్రదర్శించి అక్కడ బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. తాజాగా 'బాఘీ-2'తో ఈ చిన్నది బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకొని బాలీవుడ్ జనాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్. 
 
సి.సుందర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ మూవీ 'సంఘమిత్ర'లో దిశా హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో జయం రవి, ఆర్య వంటి హీరోలు నటిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నిర్మాతలు ప్రకటించారు. అయితే ఆమెతో అభిప్రాయభేదాలు రావడంతో ఈ ప్రాజెక్ట్ దిశా పటానీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. 
 
అయితే ఇదే అదునుగా భావించిన దిశా పటానీ... అంత తేలిగ్గా ఒప్పుకోలేదట. దానికోసం ఆమె రూ.3 కోట్ల వరకూ పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. నిర్మాతలూ దానికి అంగీకరించారు. అయితే మొన్నటివరకు బాగానే ఉన్న అమ్మడు సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోందని డేట్స్ క్లాష్ అవుతాయనే వంకతో ఇంకో రెండు కోట్లు పెంచేసిందట. అంటే.. ఈ ఒక్క ప్రాజెక్టుకు ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేస్తోందట. దీంతో చిత్ర యూనిట్ కూడా ఏమి అనలేని పరిస్థితి. దిశానా మాజాకా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments