''సైరా'' నరసింహారెడ్డికి కొత్త చిక్కు.. వంశీకుల ఆవేదన.. సెట్ కూల్చివేత!

''సైరా'' నరసింహారెడ్డి సినిమాకు ప్రస్తుతం ఉయ్యాలవాడ వంశీకుల నుంచి నిరసన వస్తోంది. తమ వంశానికి చెందిన వీరుడి చరిత్రను తెరకెక్కిస్తుడటం తమకు ఎంతో సంతోషం కలిగించే విషయమైనప్పటికీ.. తమను నామమాత్రంగా కూడా గ

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (11:20 IST)
''సైరా'' నరసింహారెడ్డి సినిమాకు ప్రస్తుతం ఉయ్యాలవాడ వంశీకుల నుంచి నిరసన వస్తోంది. తమ వంశానికి చెందిన వీరుడి చరిత్రను తెరకెక్కిస్తుడటం తమకు ఎంతో సంతోషం కలిగించే విషయమైనప్పటికీ.. తమను నామమాత్రంగా కూడా గుర్తించడం లేదని ఉయ్యాలవాడ వంశీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కర్నూలు నుంచి హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నామని... చిరంజీవి కానీ, రామ్ చరణ్ కానీ తమను పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. చిరంజీవిగారు వచ్చి మాట్లాడతారని చెబుతూనే ఉన్నారని... ఇంతవరకు ఆయన తమతో మాట్లాడలేదని చెప్పారు. తమ వంశీయుడి సినిమా తీస్తూ.. తమను పక్కన పెట్టి, వారి పని మాత్రం వారు చేసుకుంటూ పోతున్నారని వాపోయారు. 
 
కాగా, బ్రిటీష్ వారికి ముచ్చెమటలు పట్టించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ''సైరా'' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నరసింహారెడ్డిగా చిరంజీవి నటిస్తుండగా, రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైరా కోసం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్ హీరోగా తెర‌కెక్కిన రంగ‌స్థ‌లం సినిమా కోసం శేరిలింగంప‌ల్లి రెవిన్యూ ప‌రిధిలో వేశారు. 
 
ఆ సెట్స్‌లోనే సైరా మూవీ షూటింగ్ జ‌రుపుతున్నారు. అయితే ఇది ప్ర‌భుత్వ భూమి కావ‌డంతో చిత్ర నిర్మాత‌లు ఎలాంటి అనుమ‌తి తీసుకోకుండా య‌ధేచ్చ‌గా షూటింగ్ జ‌రుపుతున్న క్ర‌మంలో రెవిన్యూ అధికారులు సైరాలో క‌థానాయ‌కుడి ఇంటి సెట్‌ని కూల్చేశారు. గ‌తంలో ప‌లు మార్లు ఆ స్థలాన్ని ఖాళీ చేయ‌మ‌ని నోటీసులు పంపిన ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఇలా చేయాల్సి వ‌చ్చిందని అధికారులు అంటున్నారు.
 
ముంద‌స్తు అనుమతి తీసుకుని వుంటే ఉచితంగానే షూటింగ్ చేసుకోనిచ్చేవార‌మ‌ని, కాని వారు అనుమ‌తుల్లేకుండా సెట్స్ వేశార‌ని, అందుక‌ని సెట్స్ మొత్తాన్ని కూల్చేసిన‌ట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments