Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాయల్ రాజ్‌తో కలిసి 'డిస్కోరాజా' కిక్ ఇస్తాడట... మరి అది ఎలాంటిదో?

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (22:10 IST)
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా. సెప్టెంబర్ 2న వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అలానే సెప్టెంబర్ 3 నుంచి గోవాలో కీలకమైన షెడ్యూల్ ప్లాన్ చేశారు. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత రామ్ తల్లూరి ప్రకటించారు. 
 
మహారాజా రవితేజ, విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రామ్ తళ్లూరి నిర్మాణంలో, సాయి రిషిక సమర్పణలో, రజిని తళ్లూరి ఈ చిత్రాన్ని గ్రాండియర్‌గా నిర్మిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత రామ్ తల్లూరి మాట్లాడుతూ... ఫస్ట్ లుక్ మాస్ రాజా రవితేజ ఫాన్స్‌కి మంచి కిక్ ఇచేలా ఉంది అని భావిస్తున్నాను. ఈ లుక్‌కి వంద రెట్లు కిక్ ఇచ్చే విధంగా ఫుల్ మాస్ అండ్ క్లాస్ ఎంటెర్టైనెర్‌గా డిస్కోరాజాని రెడీ చేస్తున్నారు మా దర్శకుడు వి ఐ ఆనంద్.
 
ఇక మా బ్యానర్లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నాం. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, ఢిల్లీలోని విభిన్నమైన ప్రాంతాల్లో, లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. పాయల్ రాజ్ పుత్, ఫేమ్ నభా నటేష్, తాన్యాహోప్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 
 
ఈ చిత్రాన్ని భారీ హాంగులతో, గ్రాఫిక్స్‌కి పెద్దపీట వేసి నిర్మిస్తున్నాం. థమన్ మ్యూజిక్, ఆబ్బూరి రవి డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని గ్రాండియర్ విజువల్స్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర పనితనం, నవీన్ నూలి ఎడిట్ ఈ సినిమాకు ఎంతో ప్లస్ అవుతున్నాయి. ఇక వెన్నెల కిషోర్ హిలేరియస్  కామెడీ తో ప్రేక్షకలకు నవ్వుల విందు పంచనున్నాడు, బాబీ సింహా ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. టైటిల్ కు తగ్గట్టుగా డిస్కోరాజా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుందని ధీమాగా చెప్పగలం అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

Bengaluru murder: ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments