పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్.. ఆర్ఎక్స్ 100తో బోల్డ్ యాక్ట్రస్‌గా ముద్రవేసుకుంది. ఆ సినిమా తర్వాత ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాయల్‌కు అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాయల్ మాట్లాడుతూ.. పాత్రల కోసమే అలా నటిస్తాను తప్పనిస్తే.. బయట తాను అలా హాట్‌గా వుండనని స్పష్టం చేసింది. చాలా సింపుల్‌గా వుంటానని.. ఆర్ఎక్స్ 100 తర్వాత ఇప్పటికీ సెట్లో తనను కలవడానికి చాలామంది భయపడతారని చెప్పుకొచ్చింది.
ఇంకా ప్రజలు తనను ఎందుకు ఒకే కోణంలో చూస్తున్నారో తనకు అర్థం కావట్లేదని చెప్పుకొచ్చింది. సినిమాల కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా వుంటానని మాత్రం అనుకోవద్దని.. ఎప్పటికప్పుడు విభిన్న పాత్రలు పోషిస్తానని తెలిపింది. ఆర్‌ఎక్స్ 100 తరువాత లైఫ్ మారిపోయింది. తీరికలేని షెడ్యూల్స్‌తో బిజీగా వున్నానని తెలిపింది.
ఆర్ఎక్స్ సినిమాకు తర్వాత ఆఫర్లు వచ్చాయని.. తనతో ఓ వ్యక్తి పడకను షేర్ చేసుకోమన్నాడని.. పెద్ద సినిమాల్లో అవకాశాలిస్తానని ఆఫర్ ఇచ్చాడని పాయల్ తెలిపింది. అలా ఓ వ్యక్తితో బెడ్ రూమ్ షేర్ చేసుకునే సినిమాల్లో నటించాలనే కర్మ తనకు లేదని పాయల్ చెప్పుకొచ్చింది. ఆరేళ్ల క్రితం ముంబై, పంజాబ్‌లో ఉద్యోగం చేస్తున్న సందర్భంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని తెలిపింది. సినిమాల్లో సహనటులతో బోల్డ్ సన్నివేశాల్లో కనిపించినంత మాత్రాన ఇతరులతో పడక పంచుకుంటానని అర్థం కాదని పాయల్ స్పష్టం చేసింది. ముద్దులు, బోల్డ్ సన్నివేశాలు కేవలం సినిమాల వరకే పరిమితమని పాయల్ తేల్చి చెప్పేసింది.
మీటూ వంటి ఉద్యమాలు తలెత్తినా ఇంకా పడకను పంచుకోమని అడిగే వారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదని, కొంతమంది మహిళలు ధైర్యంగా ఇలాంటి విషయాలను బహిర్గతం చేస్తున్నారు. కానీ మరికొందరు ఆ విషయాల గురించి మాట్లాడేందుకు జంకుతున్నారని పాయల్ వెల్లడించింది.
అయితే తనకు అలాంటి భయం లేదని, ఏదైనా ఓపెన్‌గా మాట్లాడటం తన అలవాటని పాయల్ తెలిపింది. ప్రస్తుతం తాను వెంకీ మామలో వెంకటేష్ సర్‌కు జోడీగా నటిస్తున్నానని, డిస్కోరాజా, ఉదయనిధి స్టాలిన్‌తో ఏంజెల్ వంటి సినిమాలు చేస్తున్నట్లు పాయల్ చెప్పుకొచ్చింది.