Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ ఆరోగ్యంగా ఉన్నారు.. తప్పుడు ప్రచారం వద్దు

ఠాగూర్
సోమవారం, 3 మార్చి 2025 (10:44 IST)
ప్రముఖ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ అనారోగ్యం పాలైనట్టు వస్తున్న ప్రచారంపై ఆయన టీమ్ స్పందించిది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. వినాయక్ ఆరోగ్యంగానే ఉన్నారని టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఆయన ఆరోగ్యం గురించి కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. 
 
ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా వాస్తవాలు తెలుసుకుని ప్రచురించాలని కోరింది. ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే, ఇటీవల వినాయక్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనను కలిసి విషెస్ చెప్పిన ఫోటోలను కూడా రిలీజ్ చేసింది. అలాగే, గత వారం వినాయక్‍ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు సుకుమార్‌లు కలిశారు. 
 
కాగా, తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను వినాయక్ రూపొందించారు. ఈ క్రమంలో ఆయనకు గత యేడాది లివర్ మార్పిడి చికిత్స జరిగింది. అప్పటి నుంచి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, తాజాగా ఆయన మరోమారు అస్వస్థతకు లోనైనట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chicken Fair: మాంసాహార ఆహార ప్రియులను ఆకట్టుకున్న చికెన్ ఫెయిర్

ప్రియుడితో కలిసివుండేందుకు సొంతిల్లు నిర్మించుకోవాలని కన్నబిడ్డ కిడ్నాప్!!

స్నానానికి పనికిరాని గంగానది నీరు.. చేపల పెంపకానికి భేష్!!

డీకే శివకుమార్ సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరు : వీరప్ప మొయిలీ

వంద డిగ్రీల వేడిలో చికెన్ ఉడికించి ఆరగిస్తే బర్డ్ ఫ్లూ సోకదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments