Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు హీరోలను పాన్ ఇండియా స్థాయికి తేనున్న దర్శకుడు విజయ్ కనకమేడల!

డీవీ
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (17:43 IST)
Director Vijay Kanakamedala
ప్రస్తుతం తెలుగు సినిమాలలో చిన్నపాటి హీరోలు కూడా పాన్ ఇండియా సినిమా స్థాయికి వెళ్ళాలని తహతహలాడుతున్నారు. అగ్ర హీరోలకు అగ్ర దర్శకులు అందలమెక్కిస్తే చిన్నహీరోలను తమను కూడా ఎవరైనా ఆదుకుంటారేమో చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఇటీవలే నాని సినిమాలు కూడా సక్సెస్ అవడం రెండు మూడు భాషల్లో విడుదల కావడంతో పాన్ ఇండియా హీరోగా నాని మారిపోయాడు. నేచురల్ స్టార్ నాని అనే పేరు కూడా ఫిక్స్ అయిపోయింది. మనింటి కుర్రాడు, పక్కింటి కుర్రాడు తరహాలో పెద్దలు కూడా ఆయన్ను రిసీవ్ చేసుకుంటున్నారు. 
 
ఇక తాజాగా చిన్న హీరోలు సింగిల్ గా నటిస్తే పాన్ ఇండియా కథ దొరకడం కష్టం గనుక మరో హీరోతో కలిసి చేయడం బెటర్ అని ఫిక్స్ అయ్యారు. తాజా సమాచారం మేరకు నారా రోహిత్ పలు సినిమాలు చేస్తున్నాడు. సోలో హీరోగా చేసినా ఆయనకు సక్సెస్ రావడంలేదు. ఇంకోవైపు బెల్లంకొండ శీను కూడా ఆమధ్య తమిళ సినిమాను తెలుగులో రాక్షసుడుగా రీమేక్ చేసి ఓకే అనిపించుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు సరైన హిట్ లేదు. వివి వినాయక్ దర్శకత్వంలో ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసి డిజాస్టర్ గా పేరు తెచ్చుకున్నారు. 
 
ప్రస్తుతం మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరోవైపు చాలా కాలం గేప్ తీసుకున్న మంచు మనోజ్ కూడా తను హీరోగా చేయడానికి ట్రై చేస్తున్నాడు కానీ సెట్ కావడంలేదు. అందుకే విలన్ గా ఓ సినిమాలో ఫిక్స్ అయ్యాడు. అందుకే ఈ ముగ్గురు ఒకే సినిమాలో నటిస్తే ఎలా వుంటుందనే ఐడియా ఓ దర్శకుడికి వచ్చింది. ఆయనే ఉగ్రం.. విజయ్ కనకమేడల. ఇప్పుడు ఈ ముగ్గురితో కలిసి పాన్ ఇండియా సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. త్వరలో సెట్ పైకి కూడా వెళ్ళ నున్న ఈ సినిమా గురించి త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments