హీరోయిన్ సమంతపై దర్శకుడు త్రివిక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ మాయ చేశావే నుంచే సమంత స్టార్ హీరోయిన్‍గా ఉన్నారని, అప్పటి నుంచి బన్నీ సమంతకు ఫ్యాన్ అని అన్నారు. స్త్రీలకు వేరే శక్తి అక్కర్లేదు, స్త్రీనే ఓ శక్తి అని చెప్పారు. అందుకే నవరాత్రులు అంటూ స్త్రీలను పూజించుకుంటున్నట్టు తెలిపారు. సమంత ముంబైలోనే కాకుండా హైదరాబాద్ అప్పుడప్పుడు కూడా రావాలని కోరారు.
పైగా, మీరు చేయడం లేదని మేం కథలు రాయడం లేదన్నారు. మీరు నటిస్తానంటే మేం రాస్తామని తెలిపారు. అత్తారింటింటికి దారేది లాగా సమంత కోసం హైదరాబాద్‌కు రావడానికి దారేది అనాలేమో అని నవ్వుతూ అన్నారు. సమంత రావాలని ట్రెండ్ చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. సమంత తెలుగు సినిమాల్లో కంబ్యాక్ ఇవ్వాలని త్రివిక్రమ్ కోరారు. హైదరాబాద్ నగరంలో జరిగిన "జిగ్రా" చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో సమంతతో పాటు అలియా భట్, త్రివిక్రమ్, ఆ చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు.