"పుష్ప-2" ప్రీరిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లా?

ఠాగూర్
మంగళవారం, 8 అక్టోబరు 2024 (19:47 IST)
అల్లు అర్జున్ - సుకుమార్ దర్శకత్వంలో రూపొందున్న "పుష్ప-2" చిత్రం రిలీజ్‌కు ముందే సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్ల మేరకు జరిగినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. తొలి భాగం ఘన విజయంతో ఇపుడు రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం మరోవైపు, నిర్మాణాంతర పనులను కూడా జరుపుకుంటుంది. కాకినాడ, యానాంలలో షూటింగ్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ నుంచి మంగళవారం ఓ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రం ఫస్టాఫ్ ఎడిటింగ్‌తో పాటు అన్ని పనులు పూర్తి చేసుకుని లాక్ చేశారని ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతేకాకుండా, ఈ చిత్రం విశ్రాంతి బ్యాంగ్ కూడా అంచనా వేయని విధంగా ఉంటుందని సమాచారం. ఈ పాన్ ఇండియా మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ సహ నిర్మాణ సంస్థ. 
 
డిసెంబరు ఆరో తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. అంతేకాకుండా, ఈ చిత్ం రూ.1000 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకుని సరికొత్త రికార్డును నెలకొల్పిందని సినీ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు, త్వరలోనే ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments