Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక అభిమానికి మా బాస్‌కు తలవంచి నమస్కరిస్తున్నా : నక్కిన త్రినాథ రావు

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (09:56 IST)
ఒక వీరాభిమానిగా మాస్ మహారాజ్ రవితేజను మా బాస్‌గా భావించి తలవంచి నమస్కరిస్తున్నట్టు ధమాకా చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన అన్నారు. ఆ చిత్ర సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ.. "ధమాకా కథకు ఓంకారం చుట్టిన ప్రసన్నకి ముందుగా కృతజ్ఞతలు. ఆయనకి పక్కనే నిలబడిన మరో రచయిత సాయి కృష్ణకి కృతజ్ఞతలు. ఈ కథని మొదట విని ఓకే చేసిన వివేక్‌కి కృతజ్ఞతలు. తర్వాత మాస్ మహారాజా రవితేజ దగ్గరికి వెళ్లాం. ఆయన ఈ సినిమాకి శ్రీకారం చుట్టారు. తర్వాత శ్రీలీల ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. చాలా అద్భుతంగా చేసింది. బీమ్స్ పాటలతో ధమాకాకి ఒక వేవ్ తీసుకొచ్చారు. ఆల్బమ్ ఇరగదీశారు. కెమరామెన్ కార్తిక్ ఘట్టమనేని అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. 
 
ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర కూడా అద్భుతమైన సెట్స్ వేశారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, వెంకట్ మాస్టర్ అద్భుతమైన యాక్షన్ డిజైన్ చేశారు. శేఖర్ మాస్టర్, యష్ మాస్టర్, జానీ మాస్టర్ మాస్‌లు మెస్మరైజ్ చేసే కొరియోగ్రఫీ అందించారు. జయరాం, రావు రామేష్, ఆది, కుమరన్, ప్రవీణ్, సచిన్, తనికెళ్ళ భరణి అందరూ అద్భుతంగా చేశారు. రావు రామేష్, ఆది, ట్రాక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రొడక్షన్ టీం అందరికీ కృతజ్ఞతలు. మేకప్, కాస్ట్యుమ్స్.. మిగతా టీమ్స్ అందరికీ కృతజ్ఞతలు. కాసర్ల శ్యామ్, రామజోగయ్య శాస్త్రీగారు అద్భుతమైన లిరిక్స్ రాశారు. 
 
మంగ్లీ అద్భుతంగా పాడటంతో పాటు రవితేజ ఎలివేషన్ మ్యూజిక్‌లో ఆమె వాయిస్ మెస్మరైజ్ చేసింది. సింగర్స్ అందరూ అద్భుతంగా పాడారు. నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్ గట్స్‌కి మెచ్చుకోవాలి. సినిమాని అద్భుతంగా నిర్మించడంతో పాటు భారీ ప్రమోషన్స్ చేశారు. ఎక్కడ చూసినా ధమాకానే. భారీగా రిలీజ్ చేశారు. విశ్వప్రసాద్, వివేక్ గారికి కృతజ్ఞతలు. పీపుల్ మీడియా స్టాప్‌కి కృతజ్ఞతలు. మా పీఆర్వో‌లు వంశీ శేఖర్ అద్భుతంగా ప్రమోషన్స్ చేశారు. 
 
ధమాకా విజయానికి వాళ్ళు కూడా ఒక కారణం. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా హార్డ్ వర్క్ చేశారు. అందరికీ పేరుపేరునా థాంక్స్. డిస్ట్రిబ్యుటర్స్, ఎగ్జిబీటర్స్ చాలా సంతోషంగా వున్నారు. రవితేజ నాకు చాలా గొప్ప ఫ్లాట్ ఫామ్ ఇచ్చారు. అందరినీ హ్యాండిల్ చేస్తూ ఈ సినిమాని ఇక్కడి వరకూ తీసుకొచ్చా. ఈ సక్సెస్ వచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. ఈ సక్సెస్‌కి శ్రీకారం చుట్టిన మా బాస్ రవితేజకి ఒక అభిమానిగా తలవంచి నమస్కారం చేస్తున్నాను'' అన్నారు.
 
నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. "ధమాకని బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్‌కి కృతజ్ఞతలు. మాకు సపోర్ట్ చేసిన మీడియాకు కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన రవితేజకి కృతజ్ఞతలు. శ్రీలీలతో పాటు మిగతా నటీనటులందరికీ కృతజ్ఞతలు. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన బీమ్స్ కి థాంక్స్. , డైరెక్టర్ త్రినాథరావు, రైటర్ ప్రసన్న, మిగతా సాంకేతిక నిపుణులకు, మా ప్రొడక్షన్ టీంకు  కృతజ్ఞతలు'' తెలిపారు.
 
నిర్మాత వివేక్ మాట్లాడుతూ., ధమాకా ఇంత పెద్ద విజయం సాధించినందుకు చాలా అనందంగా వుంది. దీనికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు.
 
ప్రసన్న మాట్లాడుతూ.. ఎప్పుడో మొదలైన ఒక ఆలోచన ఈ రోజు వందకోట్ల షీల్డ్ వరకూ వచ్చిందంటే ఒక రచయితగా చాలా ఆనందంగా వుంది. ఈ అనందం నాకు ఇచ్చిన విశ్వప్రసాద్‌కి వివేక్‌లకు కృతజ్ఞతలు. రవితేజ మమ్మల్ని మరో స్థాయిలోకి తీసుకెళ్ళారు. ఈ సినిమాతో సెటిల్ అయిపోయాననే ఫీలింగ్ వచ్చింది. కోవిడ్ తర్వాత క్రాక్ సినిమాతో థియేటర్‌కి గేట్లు తెలిచారు. ఓటీటీ తర్వాత థియేటర్‌కి రారు అనుకునే సమయంలో ధమాకాతో మరోసారి గేట్లు తెరిచారు. రవితేజ అభిమానులు చూపిన ప్రేమని మర్చిపోలేను. 
 
శ్రీలీల రాకెట్‌లా దూసుకెళ్తుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. దర్శకుడు త్రినాథరావు మాస్ పల్స్ ఈ సినిమాని ఇంతగొప్పగా తీయడానికి కారణం. ఈ సినిమాతో మరోసారి ఆయనతో పని చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసిన మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు'' తెలిపారు. ఈ కార్యక్రమంలో బీమ్స్ సిసిరిలియో, ప్రవీణ్ పూడి, నాగేంద్ర, ప్రవీణ్ , కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిల్లలకు భోజనం పెట్టే ముందు రుచి చూడండి.. అంతే సంగతులు: రేవంత్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments