Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలీలకు కంగ్రాట్స్... ఇలాంటివి వింటూనే ఉండాలి.. రవితేజ

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (09:50 IST)
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌ టైనర్ ''ధమాకా'. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. 
 
డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ధమాకా' అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి మాసీవ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ధమాకా 101 కోట్ల మాసివ్ సెలబ్రేషన్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో మేకర్స్, మీడియా ప్రతినిధుల చేతుల మీదగా చిత్ర యూనిట్‌కు మెమెంటోలను ప్రదానం కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది.
 
అనంతరం మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. "చాలా అనందంగా వుంది. దర్శకుడు త్రినాథరావు, రచయిత ప్రసన్నకి అభినందనలు. శ్రీలీలకి కంగ్రాట్స్. ఇలాంటి కంగ్రాట్స్ ఇంక వింటూనే వుండాలి. భీమ్స్ ఇలాగనే ఇరగదీసేయాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్లకి బిగ్  కంగ్రాట్స్. ఎక్కడా రాజీపడకుండా చేశారు. చాలా పాజిటివ్‌గా వుంటారు. వారు నెక్స్ట్ లెవల్ వెళ్తున్నారు. మీడియాతో మెమెంటోలు ఇవ్వడం చాలా బావుంది. మీడియాకి కృతజ్ఞతలు. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు'' తెలిపారు.
 
హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.. "రవితేజ నాకు బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. నా కెరీర్ బిగినింగ్‌లో ఆయనతో పని చేసే అవకాశం రావడం, ఇంత పెద్ద సక్సెస్ రావడం చాలా ఆనందంగా వుంది. రవితేజ నాలో గొప్ప ఆత్మ విశ్వాసం నింపారు. రవితేజ గొప్ప స్ఫూర్తి. ధమాకాని మాస్ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు'' తెలిపారు
 

సంబంధిత వార్తలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments