దర్శకుడు తేజ అహింస ఫస్ట్ గ్లింప్స్ విడుదల

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (17:20 IST)
Abiram look
క్రియేటివ్ జీనియస్ తేజ ప్రస్తుతం 'అహింస' అనే యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో నూతననటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా ప్రీ లుక్‌ని కూడా విడుదల చేశారు. ఈరోజు సినిమా  ఫస్ట్ గ్లింప్స్ విడుదలైయింది.
 
హీరోని అటవీ ప్రాంతంలో ఒక గ్రూప్ అతని ముఖాన్ని జూట్ బ్యాగ్‌తో కప్పి లాక్కొని వెళ్ళడం కనిపిస్తోంది. అతని ముఖం నుండి రక్తం కారినట్లు గూండాలు దారుణంగా కొట్టడం గ్లింప్స్ లో చూడవచ్చు. అహింస అనే టైటిల్‌ ఉన్నప్పటికీ సినిమాలో యాక్షన్‌ డోస్‌ హెవీగా వుందని అర్ధమౌతోంది.
 
ఈ చిత్రంతో అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. గీతిక కథానాయికగా నటిస్తోంది. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్‌పి పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.
 
చాలా కాలం తర్వాత, తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, ఆర్‌పి పట్నాయక్‌ల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ 'అహింస' కోసం కలిసింది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా,  కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పని చేస్తున్నారు.  అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందించగా, సుప్రియ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. సదా, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments