Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాహో చిత్రాన్ని మరోమారు చూడండి... మరింతగా ఎంజాయ్ చేస్తారు : డైరెక్టర్ సుజిత్

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (17:40 IST)
టాలీవుడ్ హీరో ప్రభాస్ బాహుబలి చిత్రం తర్వాత నటించిన తాజా చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వం వహించగా యువీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ హీరోయిన్. అయితే, ఈ చిత్రం భారీ అంచనాల మధ్య గత శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 
కానీ, ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచే నెగెటివ్ టాక్ లేదా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దాదాపు రెండేళ్ళ పాటు ఎంతో శ్ర‌మించి తెర‌కెక్కించారు. అయితే, ఈ చిత్రానికి డివైడ్ టాక్ రావ‌డంతో ఫ్యాన్స్ కూడా చాలా హ‌ర్ట్ అయ్యారు. కొన్ని చోట్ల విధ్వంసం కూడా సృష్టించారు. అయితే చిత్ర రిజ‌ల్ట్‌పై ప్ర‌భాస్ కాని, సుజీత్ కాని స్పందిస్తారేమోన‌ని ఎదురు చూస్తున్న క్ర‌మంలో ద‌ర్శ‌కుడు సుజీత్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ‌పు పోస్ట్ చేశారు. 
 
"నేను 17 ఏళ్ళ వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడు ల‌ఘు చిత్రం తెర‌కెక్కించాను. ఆ స‌మ‌యంలో డ‌బ్బులు లేవు. ఒక టీం లేదు. కేవ‌లం నా ఫ్యామిలీ, ఆర్కుట్ ఇవి రెండు మాత్ర‌మే నాకు మ‌ద్దతుగా ఉండేవి. నా ల‌ఘు చిత్రాల‌కి 90 శాతం ఎడిటింగ్‌, దర్శకత్వం‌, కెమెరా వ‌ర్క్ నేనే చేశాను. ఆ స‌మ‌యంలో నేను చేసిన త‌ప్పుల నుండి చాలా నేర్చుకున్నాను. విమ‌ర్శ‌కుల విమ‌ర్శ‌లు నాకు ఎల్ల‌ప్పుడు ఓ ప్రోత్సాహంలాగా అనిపిస్తుంటుంది. 
 
చాలా దూరం ప్ర‌యాణించి, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాను. కానీ సాధించాల‌నుకున్న‌ది ఎప్పుడు వ‌దిలి పెట్ట‌లేదు. ఈ రోజు 'సాహో' చిత్రాన్ని కొంత మంది ప్ర‌జ‌లు చూశారు. ఈ చిత్రం నుండి కొంద‌రు చాలా ఆశించారు. కొంద‌రు చాలా ఇష్ట‌ప‌డ్డారు. సినిమా చూసిన వారంద‌రికి నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. మీరు ఏదైన మిస్ అయితే మ‌రొక‌సారి సినిమా చూడండి. మీరు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తార‌ని నేను హామీ ఇస్తున్నాను' అని సుజిత్ తన పోస్టులో కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గెస్ట్ హౌసుల్లో అమ్మాయిలతో కొండా మురళి ఎంజాయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ (Video)

ఇదేం రిపోర్టింగ్ బ్రో, ఫెంగల్ తుపాను గాలుల్లో గొడుగు ఎగిరిపోతున్నా మైక్ పట్టుకుని...(Video)

పెళ్లయ్యాక మీరు చేసేది అదే కదా: విద్యార్థినిలపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు

ఫెంజల్ తుపాను: కడపలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తిరుపతి నుంచి వెళ్లాల్సిన 4 విమానాలు రద్దు

అదానీ కంపెనీలో ఒప్పందాలు జగన్‌కు తెలియవా? పురంధేశ్వరి ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments