Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీ వ్యక్తిత్వం విశిష్టమైనది.. ఇప్పటికీ ఆ పూరి గుడిసె ఎందుకుంటుందో తెలుసా?

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులను కలుస్తున్నారు. వారిలో సెల్ఫీ దిగేందుకు సోమవారం నుంచి ముహూర్తం పెట్టుకున్నారు. సోమవారం చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో రాజకీయాలపై అభిమానులను ఉద్దేశించి

Webdunia
మంగళవారం, 16 మే 2017 (10:14 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులను కలుస్తున్నారు. వారిలో సెల్ఫీ దిగేందుకు సోమవారం నుంచి ముహూర్తం పెట్టుకున్నారు. సోమవారం చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో రాజకీయాలపై అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన రజనీకాంత్.. మంగళవారం కూడా ఫ్యాన్స్‌తో సెల్ఫీ తీసుకున్నారు. ఇదే కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు ఎస్పీ ముత్తురామన్ మాట్లాడుతూ.. రజనీకాంత్ నివాస భవనంపై ఓ పూరి గుడిసె ఉంటుందని.. అది ఎందుకు ఉంటుందో ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు.
 
ఇందుకు సమాధానం కూడా ఆయన చెప్తూ.. రజనీకాంత్ నిరాడంబరతకు అది నిదర్శనమని ఎస్పీ ముత్తురామన్ తెలిపారు. తామిద్దరం కలిసిన మొదటిరోజు ఆయన తనతో ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారన్నారు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ, ఫిలిం ఇనిస్టిట్యూట్‌‌లో చదువుతున్న సమయంలో చెన్నైలో కొంతమంది స్నేహితులతో కలిసి రజనీకాంత్ గుడిసెలోనే ఉండేవారని గుర్తు చేశారు.
 
ఇంత ఎదిగినా ఆయన దానిని మర్చిపోలేదని, అందుకే ఇప్పుడు ఆయన భవంతి పైన అలాంటి గుడిసె ఒకటి కట్టించారని అన్నారు. మనం ఎక్కడ నుంచి వచ్చామనేది మరిచిపోకూడదని రజనీకాంత్ చెప్పేవారని.. అంత విశిష్ట వ్యక్తిత్వం రజనీకాంత్‌దని చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments