Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలయాళ సినీ దర్శకుడు సాచీ కన్నుమూత

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (11:52 IST)
Sachy
మలయాళంలో విడుదలై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన బ్లాక్‌బస్టర్ సినిమా అయ్యప్పనమ్ కోషియమ్ చిత్ర దర్శకుడు సాచీ కన్నుమూశాడు. ఈయనకు మూడు రోజుల కింద గుండెపోటు రావడంతో వెంటనే ఈయన్ని హాస్పిటల‌్‌కు తరలించారు. వెంటిలేటర్‌పై ఉన్న దర్శకుడు మృత్యువుతో పోరాడుతూ ఓడిపోయాడు. 
 
త్రిస్సూర్‌లోని ప్రైవేటు ఆస్ప‌త్రిలో గురువారం మ‌ర‌ణించారు. కొద్ది రోజుల క్రితం సాచీ తుంటి మార్పిడి ఆపరేషన్  చేయించుకున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లు తీవ్ర‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో అత‌నికి జూన్ 16న‌ గుండెపోటు రావ‌డంతో మెరుగైన చికిత్స కోసం కేర‌ళ‌లోని త్రిస్సూర్‌లో జూబ్లి మిష‌న్ ఆస్పత్రికి త‌ర‌లించారు. అయితే ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో వెంటిలేట‌ర్‌పై ఉంచి చికిత్స అందించారు. వైద్యానికి ఆయ‌న శ‌రీరం స్పందించ‌క‌పోవ‌డంతో గురువారం రాత్రి 9.30 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచారు.
 
48 ఏళ్ల సాచీ పూర్తి పేరు కెఆర్ స‌చ్చిదానంద‌న్‌. 2015లో ఆయ‌న ద‌ర్శ‌కుడిగా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చారు. ఆయ‌న చివ‌రి సారిగా పృథ్వీ సుకుమార‌న్ హీరోగా న‌టించిన‌ ''అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్'' చిత్రానికి ప‌ని చేశాడు. ఇది సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకుని సాచీకి మంచి పేరును తెచ్చిపెట్టింది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments