చిరంజీవిని క్షమాపణలు కోరిన వర్మ ... ఎందుకో తెలుసా?

ఠాగూర్
ఆదివారం, 9 నవంబరు 2025 (14:47 IST)
మెగాస్టార్ చిరంజీవిని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్షమాపణలు కోరారు. దీనికి కారణం లేకపోలేదు. ఆర్జీవీ తెరకెక్కించిన తొలి చిత్రం శివ. అక్కినేని నాగార్జున - అమల హీరోహీరోయిన్లు. 36 యేళ్ల క్రితం విడుదలై సంచలనం సృష్టించింది. ఇపుడు మళ్లీ రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందానికి చిరంజీవి విషెస్ చెపుతూ ఓ వీడియోను షేర్ చేశారు. 
 
దీనిపై రాంగోపాల్ వర్మ స్పందించారు. 'థాంక్స్‌ చిరంజీవి గారు. అనుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నా. విశాల హృదయంతో మా టీమ్‌ని విష్‌ చేసింనందుకు మరోసారి కృతజ్ఞతలు' అని ట్వీట్‌ చేశారు. 
 
అయితే, చిరంజీవికి వర్మ సారీ చెప్పడానికి కారణమేంటన్నది చెప్పకపోవడంతో నెట్టింట చర్చ మొదలైంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఆగిపోయిన ప్రాజెక్టును అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. చిరంజీవి హీరోగా ఆర్జీవీ 'వినాలని ఉంది' అనే సినిమా తెరకెక్కించాలనుకున్న సంగతి తెలిసిందే.
 
కాగా, శివ చిత్రం రీ రిలీజ్‍‌పై చిరంజీవి స్పందిస్తూ, 'శివ' చూసి నేను ఆశ్చర్యపోయా. అది సినిమా కాదు ఓ విప్లవం. తెలుగు సినిమాకి కొత్త నిర్వచనం ఇచ్చింది. ఆ మూవీలో హీరో సైకిల్‌ చైన్‌ లాగే సీన్‌ ఎప్పటికీ మరిచిపోలేనిది. నాగార్జున యాక్టింగ్‌ ఫెంటాస్టిక్‌. అమల, రఘువరన్‌.. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుండటం మంచి ప్రయత్నం. 
 
ఈ సినిమా విషయంలో రామ్‌గోపాల్‌ వర్మ విజన్‌ గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. కెమెరా యాంగిల్స్‌, లైట్స్‌ అండ్‌ సౌండ్స్‌ వావ్‌ అనిపించాయి. ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అని అప్పుడే నాకు అనిపించింది. హ్యాట్సాఫ్‌ టూ రామ్‌గోపాల్‌ వర్మ. చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అని చిరంజీవి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నవంబర్ 21లోపు కోర్టుకు హాజరు అవుతాను.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి

పవన్ గారూ.. దీనిని భక్తి అనరు.. రాజకీయ నటన అంటారు.. ఆర్కే రోజా ఫైర్

హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments