Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

ఠాగూర్
సోమవారం, 17 మార్చి 2025 (17:30 IST)
తన మాజీ భార్య సీతతో తాను వైవాహిక జీవితం కొనసాగించిన ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదని కోలీవుడ్ దర్శక నటుడు ఆర్.పార్తిబన్ అన్నారు. అంటే తనలో ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల సీత లేని ఇంటికి వెళ్లలేదని, అలాగే, మరో సొంతింటిని కొనుగోలు చేసే ఆలోచన కూడా చేయలేదని చెప్పారు. 
 
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పార్తిబన్ మాట్లాడుతూ, తన దర్శకత్వంలో నటించేందుకు హీరోలు ముందుకు రాకపోవడంతో హీరోగా తానే నటించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తన సినిమాల్లో హీరోయిన్‌గా సీత నటించారని, కానీ, అప్పటికే ఆమె 50కు పైగా చిత్రాల్లో నటించారని గుర్తుచేశారు. తన సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం జరిగిపోయిందన్నారు. ఇక్కడ తాను సీతను ప్రేమించడం పెద్ద విషయం కాదనీ, తనను సీత ప్రేమించడం గొప్ప విషయమన్నారు. అయినా ఆమెకు ఎంతమాత్రం గర్వం లేదని, ఆమె సింప్లిసిటీ చూసి తాను ఆశ్చర్యపోయేవాడినని తెలిపారు. పెళ్లైన పదేళ్ల తర్వాత తామిద్దరం విడిపోయినట్టు చెప్పారు. 
 
భార్యాభర్తలు విడిపోతే కారణం ఏమిటనేది చెప్పడం అంత తేలికైన విషయం కాదన్నారు. తనకు కొంచెం ఎమోషన్స్ ఎక్కువ అని, అందుకే మేమిద్దరం కలిసివున్న ఇంటికి ఆ తర్వాత వెళ్లలేదన్నారు. మరో సొంత ఇంటిని కూడా కొనే ఆలోచన కూడా చేయలేదన్నారు. సీత మళ్లీ పెళ్లి చేసుకోవడం అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయమన్నారు. తన ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశానని, ఒక మంచి భర్తగా ఉండలేకపోయినా.. ఒక మంచి ఫాదర్‌ను అనిపించుకున్నందుకు సంతోషంగా ఉంది అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

డెలివరీ బాయ్ గలీజు పనిచేశాడు... లిఫ్టులో మూత్ర విసర్జన

మెస్‌‌లో వడ్డించే అన్నంలో పురుగులు.. ఆంధ్రా వర్శిటీ విద్యార్థుల నిరసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments